మరో సినీ విషాదం: ఉదయం గిరీష్ కర్నాడ్... మధ్యాహ్నం క్రేజీ మోహన్ కన్నుమూత!
బహుభాషా నటుడు, సాహితీ వేత్త గిరీష్ కర్నాడ్(81) సోమవారం ఉదయం బెంగుళూరులో మరణించిన సంగతి తెలిసిందే. అందరూ ఈ విషాదంలో మునిగి ఉండగా మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తమిళనటుడు క్రేజీ మోహన్ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్నాహ్నం 2 గంటలకు కన్ను మూశారు. ఈ ఇద్దరు కూడా నటులు, నాటక రచయితలే కావడం గమనార్హం.
గుండెపోటు కారణంగా క్రేజీ మోహన్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన వయసు 67 సంవత్సరాలు. మోహన్‌కు సంతాపం తెలుపుతూ పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. క్రేజీ మోహన్ మరణవార్త అఫీషియల్‌గా ప్రకటించక ముందే కొందరు సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేయడంపై సిద్ధార్థ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బ్రతికే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆ ట్వీట్స్ డిలీట్ చేయాలని కోరాడు. అయితే మధ్నాహ్నం 2 గంటలకు మోహన్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.

వృత్తి పరంగా ఇంజనీర్ అయిన క్రేజీ మోహన్‌కు కాలేజీ రోజుల నుంచే రైటింగ్ మీద ఆసక్తి. ఆయన మొదటగా రాసిన నాటకం పేరు 'క్రేజీ థీవ్స్ ఇన్ పాలవాక్కం'. ఈ నాటకం సూపర్ సక్సెస్ కావడంతో ఆయన 'క్రేజీ' మోహన్‌గా పాపులర్ అయ్యారు.
నటుడిగా పలు చిత్రాల్లో నటించడంతో పాటు అనేక చిత్రాలకు రచయితగా క్రేజీ మోహన్ పని చేశారు. కమల్ హాసన్ నటించిన ఎన్నో కామెడీ చిత్రాలకు తన రచనలు అందించారు. తమిళంలో అరుణాచలం, ఇండియన్, చిన్న వతియార్, నాన్ ఈ చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











