తండ్రయిన యంగ్ హీరో.. కవల పిల్లలతో ఫుల్ జోష్!
ప్రేమిస్తే, బాయ్స్ వంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో భరత్ తండ్రయ్యాడు. బాయ్స్ చిత్రంతో నటించిన భరత్ ఆ తరువాత ప్రేమిస్తే చిత్రంతో హీరోగా మారాడు. ఆ తరువాత పలు తమిళ చిత్రాలలో హీరోగా నటించాడు. గత ఏడాది విడుదలైన సూపర్ స్టార్ మహేష్ చిత్రం స్పైడర్ చిత్రంలో విలన్ తమ్ముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

తాజాగా భరత్ ఇద్దరు కవల పిల్లలకు తండ్రయ్యాడు. భరత్ భార్య జేశ్లీ ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ భరత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మా కుటుంబం సంతోషంతో వెళ్లి విరిసింది. ఇద్దరు బేబీ బాయ్స్ జన్మించారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని భరత్ తెలిపాడు.
శంకర్ దర్శత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంతో పరిచయమైన భరత్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. 2013 లో జేశ్లీ, భరత్ లకు వివాహం జరిగింది. ఇటీవల జేశ్లీ గర్భంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాడు.


Click it and Unblock the Notifications











