twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింధు మీనన్ ఆత్మ హత్యా వార్త వెనక అసలు కథ

    By Srikanya
    |

    చెన్నై : సింధుమీనన్ ఆత్మహత్య చేసుకుందని వచ్చిన వార్తలు ఆమె అభిమానులను కలిచివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడారు. అసలు ఈ వార్త ఎలా మొదలైంది అంటే. సింధు అనే నటి సూసైడ్ ప్రయత్నం చేసుకోవటంతో .. మీడియా పొరబడింది. అసలు సింధు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయిందో ఆమె మీడియాతో మాట్లాడి చెప్పుకొచ్చింది.

    తాను కందువడ్డీ కారణంగానే తాను ఆత్మహత్యకు యత్నించానని నటి సింధు పేర్కొన్నారు. 'అంగాడితెరు', 'పరదేశి', 'నాన్‌ మహాన్‌ అల్ల' వంటి పలు సినిమాలు, 'పిల్త్లెనిలా', 'ముత్తారం', 'పొన్నూంజల్‌'తోపాటు పలు ధారావాహికల్లో నటిస్తున్నారీమె. ఇదిలా ఉండగా గత ఆరోతేదీన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఆమెను స్థానికులు, బంధువులు వడపళనిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న ఆమె మంగళవారం కమిషనర్‌కు ఫిర్యాదు చేసే నిమిత్తం కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదుపత్రాన్ని ఇచ్చి బయటకు వచ్చిన ఆమె స్పృహకోల్పోయి కిందపడ్డారు.

    కాసేపటికి తేరుకుని మీడియాతో మాట్లాడుతూ.. 'అయ్యప్పన్‌ ఆగియ నాన్‌' అనే చిత్రం తెరకెక్కించడం కోసం ఇటీవల నిర్మాణ సంస్థను ప్రారంభించానన్నారు. ఇందుకోసం పురసైవాక్కంకు చెందిన ఒకరి వద్ద రూ.4.5 లక్షలు రుణం తీసుకున్నట్టు తెలిపారు. ఆ మొత్తం తిరిగి చెల్లించేసినా.. ఇంకా వడ్డీ కట్టాలని ఇటీవల ఓ ముఠా చిత్రీకరణ స్పాట్‌లో బెదిరించిందన్నారు. యాసిడ్‌ పోసేస్తామంటూ భయపెట్టారని, దీనిపై విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయమై ఆవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించినట్టు సింధు తెలిపారు.

    ఇక ఈమె ఆత్మహత్యా ప్రయత్నం వార్తను మీడియా సింధు మీనన్ గా భావించి ప్రచారం చేసింది. దాంతో సింధు మీనన్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చింది.
    ఆత్మహత్యాయత్నం చేశానంటూ మీడియాలో వచ్చిన రూమర్లను దక్షిణాది నటి సింధూ మీనన్ ఖండించింది. అప్పుల బారి పడిన సింధూమీనన్ ఆత్మహత్యకు ప్రయత్నించారని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని సింధు మీనన్ వెల్లడించారు. ఆత్మహత్యకు సంబంధించిన వార్తలన్ని పుకార్లేనని సింధు మీనన్ తెలిపింది. తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం చిత్రాల్లో.. తమిళంలో కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో సింధు మీనన్ నటించింది.

    English summary
    Small-time Kollywood actor Sindhu on Tuesday approached the police commissioner’s office to register a complaint against five women loan sharks, who have been allegedly harassing her demanding high interest rates for a loan she had taken eight months back. The supporting actress, who recently attempted suicide by consuming an overdose of sleeping pills, has said it was a kandhuvatti gang which forced her to take the extreme step. Sindhu claimed that she took a loan of Rs 4 lakh from five women in Purasawalkam about eight months abck for producing a film that was being directed by her brother.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X