అన్నయ్యతో మరో సినిమా స్టార్ట్ చేసిన ధనుష్.. 13ఏళ్ళ తరువాత పవర్ఫుల్ కాంబినేషన్

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను అందుకు ఉన్నటువంటి టాలెంటెడ్ దర్శకులు ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో అయితే హిట్స్ అనుకోవడం లేదు. ఎంత కొత్తగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు వృథా అవుతున్నాయి. తమిళం ఇండస్ట్రీలో కొన్నేళ్లక్రితం డిఫరెంట్ మేకింగ్ తో ఆకట్టుకున్నటువంటి టాలెంటెడ్ దర్శకుడు సెల్వా రాఘవన్ కూడా ఇప్పుడు అదే తరహాలో ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి, సెల్వా రాఘవన్ తన సోదరుడు ధనుష్ కెరీర్ సక్సెస్ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. తుల్లువధో ఇళమై, కాదల్ కొండేయిన్, పుధుపేట, మయక్కం ఎన్న.. వంటి చిత్రాలను ధనుష్ తోనే తెరకెక్కించాడు. ఆ సినిమాలు ధనుష్ కు నటుడిగానే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఒక మంచి మార్కెట్ ను సెట్ చేశాయి.

ఈ దర్శకుడుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి విజయాలు ఉన్నాయి. 7/g బృందావన కాలనీ సినిమా తోపాటు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో మంచి క్రేజ్ రావడంతో అతను శ్రీ రాఘవ అని పేరు కూడా మార్చుకున్నాడు. యుగానికి ఒక్కడు సినిమా తమిళ్ లో అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ తెలుగులో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఒక విధంగా కార్తీకి తెలుగులోనే మొదటి సక్సెస్ అని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత శ్రీ రాఘవ అనుష్కతో వర్ణా అనే ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాడు.

 Actor Danush new movie with his brother Selvaraghavan,

ఆర్య హీరోగా నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినప్పటికీ శ్రీ రాఘవకు అవకాశాలు ఏమి తగ్గలేదు అతని సోదరుడు ధనుష్ కూడా అన్నయ్య తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ శ్రీరాఘవ మాత్రం సరైన స్క్రిప్ట్ లేనిదే సినిమా చేయకూడదని ఇన్ని రోజులు ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. ఇక ఫైనల్ గా ఇటీవల వీరి కలయికలో ఒక ప్రాజెక్ట్ అయితే మొదలయ్యింది. అసలైతే ఇంతకుముందు యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ తో రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు భిన్నంగా మరొక ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన సెల్వా రాఘవన్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశాడు. 'నానే వరువెన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజే మొదలయ్యింది. 13 ఏళ్ల క్రితం వరకు వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ అన్నదమ్ములు మళ్ళీ ఇన్నాళ్లకు కలుస్తున్నారు అనగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో బిగిల్ ఫేమ్ ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధనుష్ ఇప్పటికే తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కబోయే సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఎన్నో సెన్సిటివ్ అంశాలను టచ్ చేయబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X