Dhanush భార్యకు విడాకులు ఇచ్చిన ధనుష్.. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి రజనీకాంత్ కూతురు గుడ్‌బై
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతున్నది. సమంత, నాగచైతన్య వైవాహిక జీవితానికి తెరపడిన విషయం ఇంకా మరిచిపోకముందే తమిళ సినీ పరిశ్రమలో మరో స్టార్ కపుల్ దాంపత్య జీవితానికి గుడ్‌బై చెప్పారు. ధనుష్, ఐశ్వర్యరాయ్ తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరి బ్రేకప్ గురించిన వివరాల్లోకి వెళితే..

2004లో ధనుష్‌తో ఐశ్వర్య రజనీకాంత్ వివాహం
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో ధనుష్ వివాహం దక్షిణా భారతీయ సంప్రదాయం ప్రకారం చెన్నైలో జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో 2004, నవంబర్ 18వ తేదీన ధనుష్, ఐశ్వర్యరాయ్ వివాహం చేసుకొన్నారు వీరిద్దరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే దాదాపు 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది.

కొద్దికాలంగా దంపతుల మధ్య విభేదాలు
గత కొద్దికాలంగా తమిళ స్టార్ ధనుష్, తన భార్య ఐశ్వర్య రజనీకాంత్ మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయనే విషయం కోలీవుడ్ మీడియాలో భారీ స్థాయిలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కుటుంబానికి సంబంధించిన విషయం కావడంతో ఎవరూ కూడా పెదవి విప్పడానికి సాహసం చేయలేదనే విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడింంచాయి.

ధనుష్, ఐశ్వర్య సంయుక్త ప్రకటన
అయితే అందరూ ఊహించినట్టుగానే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేశారు. తాము సామరస్య పూర్వకంగానే విడిపోతున్నట్టు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. దాంతో ఒక్కసారిగా రెండు కుటుంబాలకు సంబంధించిన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

ధనుష్ విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడిస్తూ
ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోతున్నట్టు ఇన్స్‌టాగ్రామ్‌లో ధనుష్ పోస్టు పెట్టారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం. వ్యక్తిగతంగా ఒకరికొకరం సంపూర్ణంగా అర్దం చేసుకోనేందుకు సమయం తీసుకొంటున్నాం. మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.
ఐశ్వర్య రజనీకాంత్ ఇన్స్‌టాగ్రామ్ ద్వారా
ఐశ్వర్య రజనీకాంత్ కూడా ధనుష్ పోస్టు చేసిన ప్రకటనను తన పేరుతో తన ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 18 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఇక కొనసాగించలేం. మా నిర్ణయాన్ని మీరు గౌరవించాలి. మా ప్రైవసీకి భంగం కలిగించరనే అనుకొంటున్నాను. మీ అందరి ప్రేమను ఆకాంక్షిస్తూ.. వేగంగా దేవుడు తీసుకొన్న నిర్ణయం అంటూ ఐశ్వర్య రజనీకాంత్ పోస్టులో తెలిపారు. ఈ విడాకులు ప్రకటనకు ఎలాంటి కాప్షన్ అవసరం లేదు. మీరు అర్ధం చేసుకోవడం, ప్రేమను కురిపించడమే ముఖ్యం అంటూ ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు.

రజనీకాంత్ కుటుంబంలో రెండో విడాకుల సంఘటన
సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంలో ఇది రెండో విడాకుల సంఘటన. గతంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్య కూడా తన భర్త అశ్విన్ రాంకుమార్‌తో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత 2019లో పారిశ్రామిక వేత్త విషాగన్ వనంగముడి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు. సౌందర్యకు వేద్ కృష్ణ అశ్విన్ అనే కుమారుడు ఉన్నారు. తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ కూడా ధనుష్ నుంచి విడిపోవడం జరిగింది. ఈ వ్యవహారంపై రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











