twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో ధనుష్ తండ్రికి అరెస్టు వారెంట్‌

    By Srikanya
    |

    చెన్నై : తమిళ స్టార్ హీరో ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజాకు చెక్‌బౌన్స్‌ కేసులో మేజిస్ట్రేటు కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. స్థానిక సాహుకారుపేటకు చెందిన సినిమా ఫైనాన్షియర్‌ ముకున్‌చంద్‌ వద్ద నుంచి కస్తూరిరాజా 2012లో రూ.65 లక్షలు అప్పు తీసుకున్నారు. దీనికి సంబంధించి కస్తూరిరాజా రెండు చెక్కులను ఇచ్చారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అయితే చెక్కును డిపాజిట్‌ చేయగా.. బ్యాంకులో నగదు లేకపోవడంతో బౌన్స్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కస్తూరిరాజాపై జార్జ్‌టౌన్‌ మేజిస్ట్రేటు కోర్టులో ముకున్‌చంద్‌ చెక్‌బౌన్స్‌ మోసం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇది న్యాయమూర్తి కోదండరాజ్‌ ఎదుట విచారణకు వచ్చింది. కస్తూరిరాజా తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో.. బెయిల్‌ అవకాశమున్న అరెస్టు వారెంట్‌ను జారీచేశారు. అనంతరం ఈ కేసును రానున్న 13వ తేదీకి వాయిదా వేశారు.
    పూర్తి వివరాల్లోకి వెళితే...

    Actor Dhanush's father arrest warrant rules HC

    ఈ కేసు చాలా కాలం నుంచి అంటే 2012 నవంబర్ నుంచీ నలుగుతోంది. అప్పట్లో కస్తూరిరాజా తన నుంచి రూ.65 లక్షలు అప్పు తీసుకున్నారని సినీ ఫైనాన్షియర్‌ బోత్రా పేర్కొన్నారు. ఈ మొత్తం తిరిగి చెల్లించేందుకు చెక్కు ఇచ్చారని, అయితే బ్యాంకులో నగదు లేకపోవడంతో బౌన్స్‌ అయిందన్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ వద్ద ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.

    కస్తూరి రాజాపై మోసం కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్‌పై న్యాయమూర్తి ఆర్ముగస్వామి సమక్షంలో విచారణ జరిగింది. నగర పోలీసు కమిషనర్‌ రెండు వారాల్లో రిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇక గతంలోనూ కస్తూరి రాజా తెలుగు నిర్మాత నట్టికుమార్ తో వివాదమై కేసులో ఇరుక్కున్నారు. ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా '3' చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తెలుగు హక్కులను పొందిన నట్టి కుమార్‌ నుంచి రాజా అనేక వివాదాలను, అభియోగాలను ఎదుర్కొన్నారు.

    అలాగే ఈ చిత్రం రైట్స్‌ కొనుగోలు చేయటం వల్ల తానెంతో నష్టపోయానని, రాజా అందుకు పరిహారంచెల్లించాలని కోరారురు నిర్మాత నట్టి కుమార్‌. వీటిని తిప్పికొడుతూ, ఒప్పందం ప్రకారం ఆ చిత్రం రైట్స్‌ను తాను అమ్మానని, నట్టికుమార్‌ తనపై వెూపే అభియోగాల్లో ఎలాంటి నిజం లేదని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టికుమార్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయ్యాయని, దాంతో తానెంతో నష్టపోయానని కస్తూరి రాజా పేర్కొన్నారు. నట్టి నిరాధారమైన అభియోగాలను చూసి పోలీసులు కూడా నవ్వుకుంటున్నారు.

    నన్ను, నా కొడుకు ధనుష్‌ను, కోడల్ని వివాదాల్లోకి లాగితే, అతనిపై నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేయడం తప్ప, వేరే గత్యంతరం లేదన్నారు కస్తూరి రాజా. రాజా మాటలను ఖండిస్తూ, రాజాతో కుదుర్చుకున్న ఒప్పందానికి తగ్గ అన్ని ఆధారాలు తనవద్ద వున్నాయని, మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని బహిర్గతపరుస్తానని, అతడన్నీ అబద్ధాలు చెబుతున్నాడని, నట్టి కుమార్‌ సమాధానం ఇచ్చారు. మళ్లీ ఈ సారి కోర్టు కేసులో కస్తూరి రాజా ఇరుక్కోవటంతో హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    George Town Metropolitan Magistrate Court issued an arrest warrant to film director Kasthuri Raja in a defamation case filed by two film financiers. The complainants, S. Mukanchand Bothra and his son Gagan, claim that N. Manikandan, working in Kasthuri Raja’s production house, lodged a police complaint alleging he was attacked by thugs hired by the duo. Investigation found the complaint to be false.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X