కమల్‌కు కరోనా కష్టాలు.. మాజీ జీవితభాగస్వామి గౌతమితో గందరగోళం.. ఏం జరిగిందంటే
విలక్షణ నటుడు, మక్కల్ నీది మైయామ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చెన్నై మున్సిపల్ అధికారులు చుక్కలు చూపించారు. కమల్ హాసన్‌కు కరోనా అంటూ అధికారుల అత్యుత్సాహం కారణంగా మీడియాలో హల్‌చల్ కావడం.. రూమర్లు విస్తృతంగా ప్రచారం కావడంతో కమల్ హసన్ స్పందించాల్సి వచ్చింది. అసలు ఇంతకు కమల్ విషయంలో అధికారుల అత్యుత్సాహం ఎంతటి గందరగోళానికి కారణమైందంటే..

చెన్నై మున్సిపల్ అత్యుత్సాహం
చెన్నై మున్సిపల్ అధికారులు కరోనా బాధితుల ఇంటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనావైరస్ సోకిన వ్యక్తుల నివాసాలకు స్టిక్కర్లు అంటించి ఇతరులను హెచ్చరించారు. ఈ క్రమంలో ఆళ్వారుపేటలోని కమల్ హాసన్ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించడం మీడియాలో వివాదానికి దారి తీసింది.

స్వదేశంలోనే కమల్
కమల్ ఇంటికి స్టిక్కర్ అంటించడంపై పార్టీ వర్గాలు స్పందిస్తూ.. గత జనవరి నుంచి కమల్ స్వదేశంలోనే ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎంఎన్ఎం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎలాంటి ఎంక్వరీ లేకుండా, స్క్రూట్నీ లేకుండా కమల్ హాసన్ ఇంటికి స్టిక్కర్ అతికించారు అని చెప్పారు.

కమల్‌కు కరోనా అంటూ
వాస్తవాలు తెలుసుకోకుండా మరో ఇంటికి బదులు కమల్ ఇంటికి కరోనా ఉందంటూ స్టిక్కర్ అతికించి వెళ్లడంతో ఈ అంశం తమిళ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో కమల్ హసన్ స్వీయ గృహ నిర్బంధంలో ఉండటంతో అంతా నిజమే అనుకొన్నారు. మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అసలు విషయాన్ని కమల్ మీడియాకు వివరించారు.
Recommended Video

గౌతమి దుబాయ్ నుంచి
కమల్ ఇంటికి కరోనా స్టిక్కర్ వివాదంపై గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్ జీ ప్రకాశ్ స్పందించారు. ఇటీవల నటి గౌతమీ (మాజీ జీవిత భాగస్వామి) దుబాయ్ నుంచి ఇటీవల తిరిగి వచ్చారు. ఆమె పాస్ట్‌పోర్టులో అడ్రస్ కమల్ ఇంటి పేరుపై ఉండటంతో సిబ్బంది ఆయన ఇంటికి స్టిక్కర్ అతికించారు. ఇదే గందరగోళానికి దారి తీసింది.


Click it and Unblock the Notifications











