For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కమల్ హాసన్‌కు కరోనా పాజిటివ్.. ఇప్పుడు బిగ్ బాస్ 5 పరిస్థితేంటి మరి?

  |

  నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కరోనా భారిన పడ్డారు. ఇక పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుతోందని అనుకుంటున్నా క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడుతుండడంతో అందరిని సందిగ్ధంలో పడేస్తోంది. ఇక కరోనా సోకిన విషయాన్ని నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ఫాలోవర్లకు తెలియజేశాడు. యూఎస్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన అనంతరం తనకు కొద్దిగా దగ్గు వచ్చినట్లు చెప్పిన ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారట. ఇక పాజిటివ్ అని రావడంతో వెంటనే సన్నిహితులకు ఆ విషయాన్ని తెలియజేశారట.

  Actor Kamal Haasan Tests Covid Positive || Filmibeat Telugu
   హాస్పిటల్ లోనే కమల్ హాసన్

  హాస్పిటల్ లోనే కమల్ హాసన్


  తనతో గత వారం నుంచి టచ్ లో ఉన్నవారు వెంటనే కరోనా పరీక్షలు చేసుకొని క్వారంటైన్ లోకి వెళ్లాలని వీలైనంత వరకు సేఫ్ గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో కమల్ హాసన్ వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

  క్లారిటీ ఇచ్చిన హీరో

  క్లారిటీ ఇచ్చిన హీరో

  మాస్క్ దరించడమే కాకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని వివరణ ఇచ్చారు. ఇక కమల్ హాసన్ తనకు కరోనా వచ్చింది అని చెప్పగానే అభిమానులు కొంత ఆందోళన చెందారు. ఇక ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గానే ఉందని కమల్ హాసన్ చెప్పడంతో త్వరగా కోలుకోండి.. అంటూ ఫ్యాన్స్ అందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

   బిగ్ బాస్ హోస్ట్ చేసేది ఎవరు?

  బిగ్ బాస్ హోస్ట్ చేసేది ఎవరు?

  ఇక కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన తర్వాత బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5ని ఎవరు హోస్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కమల్ హాసన్ హాసన్ రెండు వారాల క్రితం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం విక్రమ్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

   232వ చిత్రం

  232వ చిత్రం


  ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ పై అంచనాలు భారిగానే జన్నాయి. అయితే ఈ సినిమా కమల్ హాసన్ కు 232వ చిత్రం కావడం విశేషం. విక్రమ్‌ సినిమాను కమల్‌హాసన్‌ తన సొంత ప్రొడక్షన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించగా, స్టంట్స్ అన్బరీవ్ కొరియోగ్రఫీ చేశారు.

   మరో మల్టీస్టారర్.

  మరో మల్టీస్టారర్.

  ఇక విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాజిల్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. 2022 మార్చ్ 31న సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే కమల్ హాసన్ సొంత బ్యానర్ లో ఇతర హీరోల సినిమాలు కూడా తెరపైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి, విక్రమ్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ ప్రాజెక్టును నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  English summary
  Actor KamalHaasan tests Covid positive after US trip
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X