»   » కిళ్ళీ కోసం కార్లు వెళ్లేవి.. అలాంటి సావిత్రమ్మ రోడ్డు మీద, ఏడ్చేశా.. కంటతడి పెట్టిస్తున్న కమల్!

కిళ్ళీ కోసం కార్లు వెళ్లేవి.. అలాంటి సావిత్రమ్మ రోడ్డు మీద, ఏడ్చేశా.. కంటతడి పెట్టిస్తున్న కమల్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Kamal Hassan Says About Savitri's Life

    మహానటి సావిత్రి జీవితంలో ఎన్నో మధురజ్ఞాపకాలు, అదేస్థాయిలో చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆమె సినీజీవితం ఎందరికో ఆదర్శనీయం. విశ్వనటుడిగా ఎదిగిన కమల్ హాసన్ కూడా సావిత్రి నుంచే నటనలో ఓనమాలు నేచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం విడుదల కావడంతో ఇప్పుడు అందరిలో ఆమె గురించే చర్చ జరుగుతోంది. జయప్రద, కమల్ మధ్య సాగిన ఇంటర్వ్యూ లో సావిత్రమ్మ అని సంభోదిస్తూ కమల్ చెప్పిన మాటలు కంటతడి పెట్టించేవిగా ఉన్నాయి.

    బాల్యనటుడిగా

    బాల్యనటుడిగా

    బాల్యనటుడిగా కమల్ హాసన్ మహానటి సావిత్రితో అనేక చిత్రాల్లో నటించారు. సావిత్రమ్మ శివాజీ గణేశన్ లాంటి గొప్ప నటుల్ని చూస్తూ పెరిగానని అన్నారు. నటనలో ఓనమాలు వారినుంచే నేర్చుకున్నట్లు కమల్ తెలిపారు.

    సావిత్రమ్మ కొడుకునే నేను

    సావిత్రమ్మ కొడుకునే నేను

    సావిత్రమ్మకు తొలి బిడ్డ పుట్టక ముందు నుంచే నన్ను ఓ దత్త పుత్రుడిలా చూసేదని కమల్ హాసన్ అన్నారు. నటనలో ఆమె రాణి అని కమల్ అన్నారు. సావిత్రమ్మ నటన చూసి ఇప్పటికి ఆశ్చర్యపోతుంటానని అన్నారు.

    రాయల్ లైఫ్

    రాయల్ లైఫ్

    ఒక స్టార్ గా ఈమె ఎవరికీ అందనంత ఎత్తు ఎదిగింది. నా జీవితంలో ఒడిదుడుకులు ఉన్నాయా అంటే లేవనే చెబుతాను. కానీ సావిత్రమ్మ ఎదుర్కొన్న ఒడిదుడుకులు కళ్లారా చూశానని కమల్ అన్నారు.

     కిళ్ళీ కోసం ఇంపాలా కార్లు వెళ్ళేవి

    కిళ్ళీ కోసం ఇంపాలా కార్లు వెళ్ళేవి


    సావిత్రమ్మ కోసం కిళ్ళీ తీసుకురావడానికి మద్రాసు నగరంలో ఇంపాలా కార్లు వెల్లేవని కమల్ అన్నారు. అలాంటి సావిత్రమ్మని రోడ్డుపై టాక్సీ కోసం నిలబడి ఉండే స్థితిలో చూశానని కమల్ హాసన్ కంటతడి పెట్టుకున్నారు.

    చిన్న రూమ్‌లో చూసి

    చిన్న రూమ్‌లో చూసి

    సావిత్రమ్మని పెద్ద స్టార్ గా ప్యాలెస్ లాంటి భవనాల్లో చూశా. అమావాస్య చంద్రుడు చిత్రంతో తాను నిర్మాతగా మారిన తరువాత తొలి చెక్ ని సావిత్రమ్మకు ఇద్దామని బయలుదేరా. సావిత్రమ్మ ఉంటున్న పెద్ద ఇల్లు గుర్తుంది. కానీ నన్ను మరో చోటికి తీసుకుని వచ్చారు. ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని చూస్తే అక్కడ చిన్న గదిలో సావిత్రమ్మ ఉంది.

     కంటనీరు ఆగలేదు

    కంటనీరు ఆగలేదు

    ఆ స్థితిలో సావిత్రమ్మని చూసి నా కంట తడి ఆగలేదు అని కమల్ హాసన్ అన్నారు. అలాంటి స్థితిలో కూడా సావిత్రమ్మని హుందాగానే చూశానని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు.

    English summary
    Actor kamal hassan about Savitri. I learned acting from Savitramma says Kamal
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more