For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కార్తీ ఇంట్లో బుల్లి హీరో.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రంజనీ చిన్నస్వామి

    |

    దక్షిణాది హీరో కార్తీ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొన్నది. కార్తీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఇంటి సభ్యుల్లో ఆనందంలో మునిగిపోయారు. తండ్రి అయ్యానంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కార్తీ పంచుకొన్నారు. పండంటి బిడ్డకు జన్మినిచ్చిన కార్తీ దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

    డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.. మాకు సంతాన ప్రాప్తి లభించింది. మాకు అబ్బాయి పుట్టాడు. నా భార్య, బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతోపాటు.. జీవితంలో మాకు గొప్ప అనుభూతికి కారణమైన డాక్టర్లకు, నర్సులకు ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మా చిన్నారికి మీ దీవెనలు కావాలి. థ్యాంక్స్ గాడ్ అంటూ కార్తీ ట్వీట్ చేశారు.

    Actor Karthi blessed with baby boy, Film faternity pours wishes

    కార్తీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2011 జూలై 3వ తేదీన రంజని చిన్నస్వామితో వివాహం జరిగింది. 2013లో ఉమ్మాయాల్ అనే కూతురు జన్మించింది. ఆ తర్వాత ప్రస్తుతం ఓ అబ్బాయికి రంజనీ, కార్తీ దంపతులు జన్మనిచ్చారు.

    కార్తీ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన సుల్తాన్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అలాగే మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

    English summary
    Kollywod actor Karthi blessed with baby boy. He tweeted that Dear friends and family, we are blessed with a boy baby. We can’t thank enough our doctors and nurses who took us through this life changing experience. Folded hands need all your blessings for the little one. Thank you god!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X