తమిళనాట ప్రకంపణలు: శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన తమిళ స్టార్ కార్తి!
Recommended Video

టాలీవుడో తన ఆరోపణలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో మకాం వేసి ప్రకంపణలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో ల్యాండ్ అవ్వడానికి ముందు ఏఆర్ మురుగదాస్, శ్రీకాంత్, రాఘవ లారెన్స్, సుందర్ సి లాంటి తమిళ సినీ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన ఆమె.... ప్రస్తుతం తమిళ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా కోలీవుడ్లో అలిజడి రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నడిగర్ సంఘం కోశాధికారిగా ఉన్న హీరో కార్తి రియాక్ట్ అయ్యారు.

శ్రీరెడ్డి ఇష్యూపై కార్తి రియాక్షన్
కోలీవుడ్లో అలిజడి రేపుతున్న శ్రీరెడ్డి ఇష్యూపై త్వరలోనే నడిగర్ సంఘం నుండి అఫీషియల్ స్టేట్మెంట్ జారీ చేయబోతున్నట్లు కార్తి తెలిపారు. ఈ విషయం గురించి ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదన్నారు.

ఆధారాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలి
శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజమైతే, ఆమె వద్ద సాక్ష్యాలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని, ఇలా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదు అని కార్తి అభిప్రాయ పడ్డారు.

మీడియా హైలెట్ చేయడంపై...
శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణల్లో నిజా నిజాలు నిర్దారణ కాకుండా ఇలాంటి విషయాలను హైలెట్ చేయడం సరైనదేనా? కాదా? అనే నిర్ణయాన్ని మీడియా వారికే వదిలేస్తున్నట్లు కార్తి తెలిపారు.

నడిగర్ సంఘం
శ్రీరెడ్డి ఇష్యూపై నడిగర్ సంఘం ఎలా స్పందించబోతోంది. ఈ విషయంలో ఎలాంటి స్టేట్మెంట్ జారీ కాబోతోంది? అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. శ్రీరెడ్డి ఆరోపణల వలన తమిళ ఇండస్ట్రీ పరువు పోకముందే సంఘం ప్రధాన కార్యదకర్శి విశాల్ ఆధ్వర్యంలో మరో రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











