మూడేళ్లుగా వెంటాడుతూనే ఉంది.. ‘సుల్తాన్’పై కార్తీ ఎమోషనల్
అన్ లాక్ ప్రక్రియ మొదలెట్టడం, షూటింగ్‌లు జరిపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో అన్ని ఇండస్ట్రీల్లో షూటింగ్‌లు మొదలయ్యాయి. మొదట చిన్న హీరోలు, ఆపై మీడియం రేంజ్ హీరోలు, ప్రస్తుతం స్టార్ హీరోలు సెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇంకొందరు షూటింగ్ మొదలెట్టడం, పూర్తి చేయడం కూడా జరిగింది. తాజగా హీరో కార్తీ సుల్తాన్ షూటింగ్ పూర్తయింది. ఈ మేరకు కార్తీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యాడు.
సుల్తాన్ షూటింగ్ పూర్తి అవ్వడంతో కార్తీ చిత్ర యూనిట్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. షూటింగ్ కంప్లీట్ అయింది. మూడేళ్ల క్రితం ఈ మూవీకి సంబంధించిన ఐడియా విన్నక్షణం నుంచి నేటి వరకు అదే ఎగ్జైట్మెంట్ ఉంది. ఇది నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్. నా టీం మొత్తం సినిమాను బెస్ట్‌గా మలిచేందుకు శ్రమించారు. అందరికీ థ్యాంక్స్ అంటూ పేర్కొన్నాడు.

సుల్తాన్ ద్వారా నేరుగా తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న రష్మిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియలో స్పందిస్తూ.. తమిళంలో నా మొదటి చిత్రం షూటింగ్ పూర్తైంది. ఎంతో మంచి మనుషులతో కలిసి పని చేశాను. అందరిపై ఎంతో ప్రేమ కురిపించారు. సుల్తాన్ పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను అంటూ రష్మిక తెలిపింది. ఈ మూవీని ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తోండగా.. భాగ్యరాజ్ కన్నన్ తెరక్కించాడు.


Click it and Unblock the Notifications











