twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో ఫ్యాన్స్‌తో పెట్టుకున్నాడు.. పాపం, కమెడియన్ ఊరే మారిపోయింది!

    |

    ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలకు భారీ సంఖ్యలో అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోకు వ్యతిరేకంగా ఏమైనా జరిగితే ఫ్యాన్స్ వెంటనే సోషల్ మీడియా రంగంలోకి దిగి తమ సత్తా చూపిస్తారు. తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల దాటికి కమెడియన్ కరుణాకరన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలు సందర్భంలో కరుణాకరన్ విజయ్ అభిమానులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండడంతో అతడిపై దాడి మొదలైంది. ఈ వ్యవహారంలో కరుణాకరన్ కూడా తగ్గడం లేదు.

    విజయ్‌కు సూటి ప్రశ్న

    సర్కార్ ఆడియో లాంచ్ లో విజయ్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ కరుణాకరన్ ప్రశ్నలు సంధించాడు. నాయకుడు బలంగా లేకుంటే ప్రభుత్వం బలంగా ఉండదని విజయ్ సర్కార్ ఆడియో వేడుకలో ప్రస్తావించాడు. విజయ్ మీరిచ్చే సలహాలు నాయకుల మాత్రమేనా.. ముందు మీ అభిమానులకు సలహాలు ఇవ్వండి. ఇతరులని బూతులు తిట్టవద్దని చెప్పండి.

    ఊరినే మార్చేశారు

    కరుణాకరన్ పై కోపంతో కొందరి విజయ్ అభిమానులు వికీపీడియాలో అతడి ప్రొఫైల్ మార్చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు. కరుణాకరన్ అసలు తమిళ వ్యక్తి కాదని తెలుగు వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారు. అతడు జన్మించింది హైదరాబాద్ లో అంటూ వికీపీడియాలో ప్రొఫైల్ మార్చేశారు.

    దుష్ప్రచారం చేయవద్దు

    దుష్ప్రచారం చేయవద్దు

    తాను జన్మించింది రెడ్ హిల్స్ పాడియానల్లూర్ లో. ఇలా ప్రొఫైల్ మార్చి దుష్ప్రచారం చేయవద్దని కరుణాకరన్ కోరాడు. గతంలో కోలీవుడ్ లో బంద్ నిర్వహించిన సమయంలో కూడా కరుణాకరన్ కు విజయ్ అభిమానులకు మధ్య వివాదం చోటు చేసుకుంది.

    అందుకే విజయ్ అంటే ఇష్టం లేదు

    అందుకే విజయ్ అంటే ఇష్టం లేదు

    విజయ్ అభిమానుల వలనే అతడంటే నాకు ఇష్టం లేదని కరుణాకరన్ తెలిపాడు. విజయ్ ఫాన్స్ ట్రోలింగ్ దారుణంగా ఉంటోందని అభిప్రాయ పడ్డారు. కరుణాకరన్ వరుస ట్వీట్స్ పెడుతుండడంతో విజయ్ ఫాన్స్ మరింతగా రెచ్చిపోతున్నారు.

    English summary
    'Is your advice only for leaders. Actor Karunakaran questions Vijay
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X