twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాక్సిడెంట్ కేసులో హీరో అరెస్టు

    By Bojja Kumar
    |

    Theni Avaatam
    చెన్నై: కోలీవుడ్ యాక్టర్ శ్రీరంజన్ యాక్సిడెంట్ కేసులో అరెస్టయ్యాడు. ఆగస్టు 5న చెన్నయ్ లో శ్రీరంజన్ కార్ డ్రైవ్ చేస్తూ ఓ పోలీసు అధికారితో పాటు నలుగురు వ్యక్తులను గాయపరిచాడు. పోలీసుల కథనం ప్రకారం నిద్ర మత్తులో శ్రీరంజన్ యాక్సిడెంట్ చేశాడని, ఈ ఘటనలో ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు హైకోర్టు జడ్జి సెక్యూరిటీ ఆఫీసర్ ఆనందన్ గాయపడ్డారు.

    ఆనందన్ రోడ్డు పక్కన బైక్ ఆపి ఫోన్ మాట్లాడుతుండగా వచ్చి ఢీకొట్టాడు, దీంతో 8 అడుగల వరకు బైక్ ను కారు లాక్కెళ్లింది. మరో రెండు ఆటో రీక్షాలను కూడా శ్రీరంజన్ కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ కారు నుంచి విడిపోయి పక్కకు పడింది. ఇద్దరు ఆటో రిక్షా డ్రైవర్లు కూడా గాయపడ్డారు.

    శ్రీరంజన్ ఫిల్మ్ షూట్ నుంచి తిరిగి వస్తున్నాడని, ఈ క్రమంలోనే నిద్రలోకి జారు కోవడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై ఐపిసి 337, 338 సెక్షన్ల కింద అరెస్టు చేశారు. అదే విధంగా అతని కారును కూడా సీజ్ చేశారు. శ్రీరంజన్ ప్రస్తుతం Theni Mavattum అనే తమిళ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు.

    English summary
    Chennai, Aug 6: 24-year-old Kollywood hero Sriranjan has been arrested over an accident case in which he knocked down four people including a police official in Chennai on Sunday, Aug 5. According to police sources, the actor fell asleep and lost control of the vehicle hitting a two wheeler which belonged to an Inspector, Anandan, a security officer for a High Court judge.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X