లైంగిక సామధ్యం పై నటీమణి...
ప్రముఖ తమిళ నటీమణి మనోరమ లేటెస్ట్గ్ గా పెళ్ళికి ముందే సెక్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మాట్లాడి అందరిలో ఆసక్తి రేపింది. ఇంపోటెన్సీ అనేది అనేక జీవితాలని నాశనం చేస్తోందంటూ మీడియాతో మాట్లాడింది. ఆవిడ మాటల్లోనే..నేను కొద్ది రోజుల క్రిందట ముఖ్యమంత్రిని కలిసాను. వారితో మాట్లాడుతూ..ఇంపోటెంట్(లైంగిక సామర్ధ్యం లేని) వ్యక్తి వల్ల ఎన్ని వివాహాలు అర్ధం లేకుండా పోతున్నాయో వివరించాను. ఈ విషయమై చట్టం తేవల్సిందేనని అభ్యర్దించాను. పెళ్ళికిముందే ఈ లైంగిక సామధ్య పరీక్షలు నిర్వహించి అందుకు అర్హులైన వారికే వివాహానికి అర్హత సర్టిఫికేట్ ఇష్యూ చేయమని కోరాను.దాని వల్ల చాలా కాపురాలు నిలబడతాయి. అలాగే ఆ సమయంలో ఎయిడ్స్ ని గుర్తించే పరీక్షలు చేయవచ్చునని చెప్పాను అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











