#మీటూ: గదికి రమ్మంటే తప్పేంటి? అతడు మగాడు, కోరికలుంటాయి...
ప్రముఖ తమిళ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సింగర్ చిన్మయి... వైరముత్తు తనతో పాటు ఎంతో మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు మీటూ ఉద్యమంలో భాగంగా ఆరోపణలు చేశారు.
అయితే ఈ కాంట్రవర్సీపై తమిళ నటుడు మరిముత్తు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలో వైరముత్తుకు మద్దుతుగా నిలవడంతో పాటు...మహిళను గదికి రమ్మంటే తప్పేంటి? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అతడు మగాడు, కోరికలుంటాయి
అతడు మహిళను గదికి రమ్మన్నాడు అంటున్నారు. ఇందులో తప్పేంటి? మీకు ఆసక్తి ఉంటే వెళ్లండి.... లేకుంటే తిరస్కరించండి. అతడు మగాడు, హార్మోన్స్ ఉంటాయి.. వాటి ప్రభావంతో కోరికలు కలుగుతాయి, ఇదంతా నేచురల్ జరిగే ప్రక్రియ అంటూ మరిముత్తు అన్నారు.

కొన్ని రోజుల్లో అన్నీ మరిచిపోతారు
ఇపుడు దీని గురించి ఇంత రచ్చ జరుగుతోంది కదా... మూడు నెలలు గడిస్తే మరో కొత్త ఇష్యూ తెరపైకి వస్తుంది. అపుడు దీన్ని ప్రజలందరూ మరిచిపోతారు అని.... వైరముత్తుకు సన్నిహితంగా ఉండే మరిముత్తు అభిప్రాయ పడ్డారు.

సిద్ధార్థ్ ఆగ్రహం
అయితే మరిముత్తు వ్యాఖ్యలపై తమిళ హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అతడి వ్యాఖ్యలు తనను డిసప్పాయింట్ చేశాయని, ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు నాతో పాటు చాలా మందిని బాధించాయి' అని వ్యాఖ్యానించారు.

నెటిజన్ల నుంచి విమర్శలు
మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మరిముత్తు వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. నటన పరంగా అతడు మంచి ఆర్టిస్ట్. అయితే అతడి వ్యక్తిత్వం మాత్రం చెత్తగా ఉందని మండి పడుతున్నారు.

అతడి ఫ్యామిలీలో అయినా ఇలాగే మాట్లాడతాడా?
మరిముత్తు ఫ్యామిలీలోని ఆడవారి పట్ల కూడా ఎవరైనా ఇలాగే తప్పుగా ప్రవర్తిస్తే... ఈ విధంగా మాట్లాడతారా? అంటూ మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో మరిముత్తుకు చురకలంటించారు.

చిన్మయి పోరాటం
తమిళ ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఉన్న వైరముత్తు లైంగిక వేధింపుల గురించి ఎవరూ మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. మీటూ ఉద్యమం ఎఫెక్టుతో సింగర్ చిన్మయి ధైర్యంగా ముందుకు వచ్చి కొన్నేళ్ల క్రితం స్విట్జర్లాండులో మ్యూజిక్ కాన్సెర్ట్‌లో పాల్గొన్న సమయంలో వైరముత్తు హోటల్ రూముకు రమ్మంటూ లైంగికంగా వేధించాడి, ఒప్పుకోకుండా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించినట్లు ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











