నిత్యానంద‌ వీడియోను రిలీజ్ చేసిన సినీతార.. మరో వివాదంగా..

వివాదాస్పద నిత్యానందస్వామి అలియాస్ పరమహంస నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక వేధింపుల అంశాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద గత కొద్దిరోజులుగా ఇండియా నుంచి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన ఆచూకీ కోసం పోలీసుల గాలిస్తున్న సమయంలో తమిళనటి మీరా మిథున్ ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

వివాదాస్పద వర్థమాన తారగా

వివాదాస్పద వర్థమాన తారగా

తమిళనాడు చిత్ర పరిశ్రమలో మీరా మిథున్ వర్థమాన తార. నటిగా కాకుండా ఇతర విషయాలతో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడిప్పుడే నిలుదొక్కుకుంటున్న ఈ తార సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఆమె తనకు సంబంధించిన ఫొటోలను పోస్టు చేయడం కాకుండా రాజకీయంగా కూడా రకరకాలు కామెంట్లు చేస్తుంటారు.

 బిగ్‌బాస్‌తో పాపులారిటీ

బిగ్‌బాస్‌తో పాపులారిటీ

నటిగా మీరా మిథున్ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. 8 థొట్టక్కల్, థానా సెండ్రా కూట్టమ్, బోధి యేరి భుధి మారి లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత తమిళ బిగ్‌బాస్‌తో మరింత పాపులారిటీ సంపాదించారు. అప్పటి నుంచి ఆమె మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

నిత్యానంద గురించిన పుస్తకంతో

నిత్యానంద గురించిన పుస్తకంతో

ఇలాంటి నేపథ్యంలోనే పాపులారిటీ సంపాదించేందుకు నిత్యానందస్వామి గురించి మీరా మిథున్ వీడియో రిలీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. తన భక్తులకు నిత్యానంద సూచించిన లివింగ్ ఎన్‌లైటెన్‌మెంట్: గోస్పెల్ ఆఫ్ పరమహంస నిత్యానంద పుస్తకాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ పుస్తకాన్ని చదువుతుండగా వీడియోను షూట్ చేశారు.

నేను దేవదూతను కాదు.. దేవుడినే

నేను దేవదూతను కాదు.. దేవుడినే

మీరా మిథున్ తన వీడియో ప్రసంగంలో నిత్యానంద గురించి చెబుతూ.. అద్భుతమైన పుస్తకంలో ఆయన భగవంతుడిగా తనకు తాను ప్రకటించుకొన్నారు. దేవదూతను అనే విషయాన్ని ఖండించారు అనే విషయాన్ని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో కింద ప్రతికూల కామెంట్లతో హోరెత్తించారు.

Recommended Video

సెక్స్ టేపుల వివాదం మళ్ళీ తెరమీదకి | Filmbeat Telugu

నిత్యానందపై పలు కేసులు

ఇక నిత్యానంద విషయానికి వస్తే... ఆహ్మదాబాద్ ఆశ్రమంలో తన భక్తులతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచిపోవడం తెలిసిందే. ఇటీవల మరో కైలాసాన్ని సృష్టించబోతున్నాను అని ప్రకటించిన ఆయన యూట్యూబ్‌లో రెగ్యులర్ అప్‌డేట్స్ ఇచ్చేవారు. విదేశాలకు పారిపోయిన ఆయనను పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో మీరా మిథున్ వీడియో రిలీజ్ చేయడం సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X