డబ్బు ఆశచూపి వివాహం చేశావా? అని కామెంట్స్.. జపాన్‌లో కొడుకు పెళ్లిలో భోరున ఏడ్చిన ప్రముఖ హీరో!

తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా దక్షిణాది భాషల్లో సుపరిచితుడైన నటుడు, రాజకీయ నేత నెపోలియన్ కుమారుడి పెళ్లి మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. డీఎంకే పార్టీ తరపున కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు త్వరలోనే వివాహన్ని జరిపించేందుకు రెీ అవుతున్నారు. అయితే తన కుమారుడు విదేశీ భార్యను చేసుకోవడంపై వివరణ ఇచ్చారు. నెపోలియన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

తమిళంలో సినీ రంగంలో హీరోగానే కాకుండా తెలుగులో విలన్ పాత్రలతో మెప్పించిన టాలెంటెడ్ యాక్టర్ నెపోలియన్. నాగార్జున అక్కినేనితో కలిసి హలో బ్రదర్ సినిమాలో పండించిన విలనిజాన్ని ఇప్పటికీ మరిచిపోలేం. ఆయన నటనలో ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకొనే వారు. అలా ప్రముఖ నటుడిగా దక్షిణాదిలో తనకంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు.

Actor Napoleon broke down at Son Dhanoosh wedding Photos are trending

సినిమా ఇండస్ట్రీలో దాదాపు 70 సినిమాల్లో నటించిన ఆయన తన అంకుల్ కేఎన్ నెహ్రూ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత 2001 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే సినీ, రాజకీయ రంగాల నుంచి తప్పుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం యూఎస్‌లో ఆయన బిజనెస్‌లో బిజీగా ఉన్నారు.

అయితే దీర్ఘకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడు ధనుష్ వివాహానికి ప్రముఖులను, సన్నిహితులను ఆహ్వానించారు. అయితే తమిళ అమ్మాయితో తాజాగా పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా అమెరికాలో ఉంటూ నీ కుమారుడికి తమిళ అమ్మాయితోనే వివాహం జరిపించావు. అమెరికన్‌తో ఎందుకు పెళ్లి జరిపించడం లేదు అని నెపోలియన్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ వేశారు.

అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ధనుష్‌ను తమిళ అమ్మాయి పెళ్లి చేసుకోవడంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. డబ్బు కోసమే ధనుష్‌ను ఆ అమ్మాయి పెళ్లి చేసుకొంటున్నది. ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు ఎందుకు చేసుకొంటున్నదనే కొందరు కామెంట్ చేయడం చర్చకు దారి తీసింది. దాంో ఆయన తనదైన శైలిలో స్పందించారు.

Actor Napoleon broke down at Son Dhanoosh wedding Photos are trending

నేను ఎక్కడ నివసిస్తున్నా.. నేను తమిళ సంప్రదాయాలు, సంస్కృతిని ఎప్పటికీ మరవను. సప్త సముద్రాలు దాటటినా తమిళ కల్చర్‌ను మరిచిపోను. తమిళ వ్యాల్యూస్‌తో నా పిల్లల్ని పెంచాను. తమిళనాడు నుంచి కోడలిని తెచ్చుకోలేదు. నాకు డబ్బు, సంపద పట్టించుకోను. నా కుమారుడి భవిష్యత్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొంటాను అని అన్నారు. ధనుష్ వివాహం నవంబర్ 7వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

జపాన్‌లో జరిగిన వివాహానికి తమిళ నటులు కార్తీ, శరత్ కుమార్, రాధిక, మీనా, కుష్బూ, సుహాసిని, కలా మాస్టర్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. శివ కార్తీకేయన వీడియో సందేశంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ పెళ్లిలో తన కుమారుడిని చూసి కంటతడి పెట్టుకొన్నాడు. ఈ వీడియో మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Read more about: napoleon dhanoosh tamil
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X