నయనతార నెక్ట్స్ మూవీ టైటిల్ ఇదే, ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్

నయనతార త్వరలో మిలింద్ రావ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాకు కుమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'నెట్రికన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. 'రౌడీ పిక్చర్స్ పతాకం'పై ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పోస్టర్లో టైటిల్ బ్రెయిలీ లిపిలో వ్రాసిఉంది. దీంతో నయనతార అంధురాలిగా కనిపించబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో కొరడ, సంకెళ్లు కూడా ఉండటంతో డిఫరెంట్ కాన్సెప్టుతో ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో లాబ్రడార్ కుక్క కూడా కీలక పాత్రలో కనిపించనుందట.

"సంతోషంగా, గర్వంగా ఉంది. నయనతార 65వ చిత్రం నిర్మించే అవకాశం రావడం గొప్పగా ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజే షూటింగ్ మొదలవుతుంది'' అని రౌడీ పిక్చర్స్ సంస్థ తమ అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు.

Actor Nayanthara next film Netrikann

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న సెక్రెడ్ గేమ్స్ చిత్రంలో మాల్కమ్ మౌరాద్‌ పాత్రలో నటించిన ల్యుక్ కెన్నీ విలన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. మిలింద్ రావు ఇంతకు ముందు సిద్ధార్థ్, ఆండ్రియా జంటగా నటించిన గృహం అనే సినిమాకు గతంలో మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

నయనతార సినిమాల విషయానికి వస్తే, చిరంజీవితో సైరాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్‌లో, ఇళయ దళపతి విజయ్, శివకార్తికేయన్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నది. సైరా మూవీ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X