»   » సరదా కాదు నేరం: ప్రముఖ నటుడి కుమారుడు అరెస్ట్

సరదా కాదు నేరం: ప్రముఖ నటుడి కుమారుడు అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: డ్రోన్ ఎగరవేయడాన్ని మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో నిషేదించిన సంగతి తెలిసిందే. వీటిని ఉపమోగించి అవాంచనీయ చర్యలు, దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రముఖ నగరాలు, పట్టణాల్లో డ్రోన్ ఎగరవేయడాన్ని నిషేదించారు. డ్రోన్ కెమెరాలతో ఏదైనా చిత్రీకరణ జరుపడానికి డ్రోన్ వినియోగించాల్సి వస్తే పోలీసుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేనిచో దాన్ని నేరంగా పరిగణిస్తారు.

తాజాగా స్థానిక సీఐటీ నగర్‌లో అర్ధరాత్రి డ్రోన్‌ను ఎగురవేసిన నటుడు పాండ్యరాజన్ కుమారుడు ప్రేమరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సిఐటీ కాలనీ బీచెస్‌ వేల్స్‌ అవెన్యూ ప్రాంతంలో అర్ధరాత్రి ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండటాన్ని చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైలాపూరు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు.

 Actor Pandiarajan's son arrested

ఆ డ్రోన్‌ను ఎగురవేసింది ప్రేమరాజన్ అని తెలుసుకుని అతడిని అరెస్టు చేశారు. అయితే తాను కేవలం సరదాగా స్నేహితులతో కలిసి డ్రోన్‌ను ఎగురవేశానని అతను చెప్పినట్లు సమాచారం. టి.నగర్‌లో నివసిస్తున్న ప్రేమరాజన్ సీఐటీ నగర్‌లో డ్రోన్‌ను ఎగురవేయడం పలు అనుమానాలకు వ్యక్తం అవయ్యాయి.

అయితే టి.నగర్ రద్దగీ ఉండే ప్రాంతం కావడం వల్లనే తాను సీఐటీ కాలనీలో డ్రోన్ ఎగురవేసానని, అంతకు మించి మరే కారణం లేదని ప్రేమరాజన్ పోలీసులకు తెలిపారు. అరెస్టు అనంతరం ప్రేమరాజన్ బెయిలుపై విడుదలయ్యారు.

English summary
Actor Pandiarajan's son Premarajan was arrested by Chennai police for flying a drone without proper permission.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu