twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టైన పవర్ స్టార్

    By Srikanya
    |

    చెన్నై : తనకు తానే పవర్ స్టార్ బిరుదు ఇచ్చుకున్న తమిళ కామెడీ హీరో శ్రీనివాసన్. ఆయన తాజాగా ప్రాడ్ కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యారు. ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి అరవై ఐదు లక్షలు రూపాయలు చీట్ చేసారని ఆయనపై అభియోగం. తమిళ పరిశ్రమలో యాభై సంవత్సరాలు దాటాక పీల్డులోకి వ్చచి నటిస్తున్న ఈయన ఇంతకుముందు హీరోయిన్స్ నిత్యామీనన్, ప్రియా ఆనంద్ లకు కోటి రూపాయలు ఆఫర్ చేసి తన ప్రక్కన చేయమన్నాడు. అయినా వారెవ్వరూ ముందుకు రాలేదు.

    ఛీటింగ్ కేసు వివరాల్లోకి వస్తే...యు.బి.ఎస్ ఇంటర్నేషనల్ అధినేత,వ్యాపార వేత్త అయిన జి.యు బాల సుబ్రమణియన్ ను మోసం చేసిన ఆరోపణలపై ఈ చెన్నై పవర్ స్టార్ ని శనివారం అరెస్టు చేసారు. తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి ఈ శ్రీనివాసన్ ని పది కోట్ల రూపాయలు సాయిం చేయాల్సిందిగా కోరాడు బాలసుబ్రణియన్. తనకు ఐదు శాతం సర్వీస్ చార్జ్ క్రింద మొదటే చెల్లించాలని అరవై ఆదు లక్షలు నొక్కేసాడు.

    ఆ తర్వాత బాలసుబ్రమణియన్ కి ఏ విధమైన సాయిమూ చేయలేదు. సరికదా ఆ అరవై ఐదు లక్షలూ అడిగినందుకు గన్ తో కాలుస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసాడు. ఇక శ్రీనివాసన్ చిత్రం లతిక ఆ మధ్యన రిలీజై వందరోజులు ఆడింది. అప్పటినుంచి ఆయనే అభిమాన సంఘాలు పెట్టుకుని,తనకు తానే పవర్ స్టార్ బిరుదు సైతం ఇచ్చేసుకున్నాడు.

    ఇక రానా 'లీడర్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్‌. హీరో రామ్ తో రామ రామ కృష్ణకృష్ణ, సిద్దార్థ తో 108 చిత్రాల్లో నటించి సక్సెస్ టాక్ తెచ్చుకొంది. మన తెలుగులో పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. అంటే...పవర్ ఫుల్ హీరో అని అర్థం. కానీ తమిళంలో ఈ టైటిల్ ని శ్రీనివాసన్ అనే కామెడీ హీరో పెట్టుకున్నాడు. ఇది తెలిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవ్వడం ఖాయం, ఈ తమిళ కామెడీ శ్రీనివాసన్ ని ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రియాఆనంద్ మాత్రం ప్రస్తుతం ఈ శ్రీనివాసన్ చేస్తున్న సినిమాల గురించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది.

    English summary
    Actor 'Power Star' Srinivasan was on Friday arrested on charges of cheating a businessman of Rs 65 lakh. He was arrested on a complaint from G U Balasubramanian, proprietor of RBS International in Chrompet, to city police Commissioner J K Tripathy that the actor had taken the money after promising to get him a 10 crore loan. Balasubramanian said he never got the loan.Srinivasan is a physician who directed and acted in the movie Lathika (2011). He later made guest appearances in movies like 'Mandapam,' 'Unakkaga Oru Kavithai,' 'Neethana Avan' and 'Indrasena.' He is working on the film 'Kanna Laddu Thinna Asaiya' with Santhanam in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X