రాధిక శరత్‌కుమార్ దంపతులపై క్రిమినల్ కేసు.. జైలు శిక్ష విధించిన మద్రాస్ హై కోర్టు
సీనియర్ నటి నటులు రాధిక శరత్‌కుమార్ మరో సమస్యలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతల మండలికి సంబంధించిన పలు కేసులతో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ దంపతులపై ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు నమోదవ్వడం చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హై కోర్టు జైలు శిక్షను కూడా విధించనున్నట్లు తెలుస్తోంది.

శరత్‌కుమార్‌పై ఏడు, రాధికపై రెండు కేసులు
ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను విచారించే మద్రాస్ ప్రత్యేక న్యాయస్థానం నటులు, రాజకీయ నాయకులైన శరత్‌కుమార్, ఆయన భార్య రాధిక శరత్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. చెక్ బౌన్స్ కారణంగా శరత్‌కుమార్‌పై ఏడు, రాధికపై రెండు కేసులు నమోదయ్యాయి.
హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకొంటున్న యువ నటి.. బంగారంలా మెరిసిపోతూ..

చెక్ బౌన్స్ అవ్వడంతో
రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు వీరిపై గత ఆరేళ్ళ నుంచి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.2015 లో రాధిక మరియు శరత్‌కుమార్ నిర్మాణ సంస్థ రేడియంట్ గ్రూప్ నుంచి భారీ స్థాయిలో అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రుణాలు సేకరించిన అనంతరం చెల్లని చెక్కులు ఇవ్వడంతో కేసులు నమోదయ్యాయి.
ప్యాంట్ వేసుకోవడం మరిచిన చితక్కొట్టుడు హీరోయిన్.. తొడ అందాలతో రచ్చ

ఆ సినిమా కోసమే..
2015లో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన 'ఇడు ఎన్నా మాయం' అనే సినిమాను నిర్మించడానికి డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఆ సినిమాలో విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో రాధికా శరత్ కుమార్ అప్పుల్లో కురుకుపోవాల్సి వచ్చింది.
Recommended Video

ఏడాది జైలు శిక్ష తప్పదా?
ఈ జంట రుణాలు తిరిగి చెల్లించలేదని అలాగే చెక్ బౌన్స్ అయినందున రేడియంట్ గ్రూప్ 2018 లో కోర్టును ఆశ్రయించింది. ఇక విచారణల తరువాత, దాదాపు ఏడాది వరకు జైలు శిక్ష విధించబడినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











