Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కట్టప్ప సత్యరాజ్ కుమార్తెకు డాక్టరేట్.. ట్విట్టర్లో హీరో కార్తీ ప్రశంసలు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్బుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించికొన్న నటుల్లో సత్యరాజ్ ఒకరు. కటప్ప పాత్ర ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ ఎంతో చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లు దాటి ముందుకెళ్తున్న సత్యరాజ్ జీవితంలో మరోసారి ఆనంద క్షణాలు వెల్లివిరిసాయి. కూతురు దివ్య సత్యరాజ్ న్యూట్రిషన్ సబెక్ట్‌లో డాక్టరేట్ సాధించారు. ఈ విషయాన్ని హీరో కార్తీ తన ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు.
దివి.. న్యూట్రిషన్ సబ్జెక్ట్‌లో నీవు డాక్టరేట్ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నీవు సాధించిన డాక్టరేట్ మాకు ఎంతో స్పూర్తిని ఇస్తున్నది. అలాగే డాక్టరేట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించిన నీకు స్వాగతం అంటూ కార్తీ తన ట్విట్టర్లో పోస్టు పెట్టి అభినందించారు.
దివ్య సత్యరాజ్ విషయానికి వస్తే యాక్టర్ సత్యరాజ్, నిర్మాత మహేశ్వరీ సత్యరాజ్ ముద్దుల కూతురు. మద్రాస్ యూనివర్సిటీలో న్యూట్రిషన్లో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యూట్రిషన్ రంగంలో పరిశోధన అనంతరం డాక్టరేట్ అందుకొన్నారు. ప్రస్తుతం ఆమె అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ఆమె గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. పేద పిల్లలకు పుష్టికరమైన ఆహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని దివ్య సత్యరాజ్ కొద్దికాలంగా చేపట్టారు .