twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కట్టప్ప సత్యరాజ్ కుమార్తెకు డాక్టరేట్.. ట్విట్టర్‌లో హీరో కార్తీ ప్రశంసలు

    |

    దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్బుతమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించికొన్న నటుల్లో సత్యరాజ్ ఒకరు. కటప్ప పాత్ర ద్వారా ఆయనకు వచ్చిన పాపులారిటీ ఎంతో చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లు దాటి ముందుకెళ్తున్న సత్యరాజ్‌ జీవితంలో మరోసారి ఆనంద క్షణాలు వెల్లివిరిసాయి. కూతురు దివ్య సత్యరాజ్ న్యూట్రిషన్ సబెక్ట్‌లో డాక్టరేట్ సాధించారు. ఈ విషయాన్ని హీరో కార్తీ తన ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు.

    దివి.. న్యూట్రిషన్ సబ్జెక్ట్‌లో నీవు డాక్టరేట్ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నీవు సాధించిన డాక్టరేట్ మాకు ఎంతో స్పూర్తిని ఇస్తున్నది. అలాగే డాక్టరేట్‌తోపాటు ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రవేశించిన నీకు స్వాగతం అంటూ కార్తీ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టి అభినందించారు.

    Actor Satya Raj daughter Divya Sathyaraj gets doctorate, Karthi appreciates

    దివ్య సత్యరాజ్ విషయానికి వస్తే యాక్టర్ సత్యరాజ్, నిర్మాత మహేశ్వరీ సత్యరాజ్ ముద్దుల కూతురు. మద్రాస్ యూనివర్సిటీలో న్యూట్రిషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యూట్రిషన్ రంగంలో పరిశోధన అనంతరం డాక్టరేట్ అందుకొన్నారు. ప్రస్తుతం ఆమె అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ఆమె గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. పేద పిల్లలకు పుష్టికరమైన ఆహారాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని దివ్య సత్యరాజ్ కొద్దికాలంగా చేపట్టారు .

    English summary
    Actor Satya Raj daughter Divya Sathyaraj gets doctorate in nutrition. In this occassion, Karthi appreciates the actor daughter in twitter. Karthi tweets that Hi Divi, Congratulations on getting the honorary doctorate in nutrition... You’ve made all of us proud. And welcome to instaSmiling face with smiling eyesSmiling face with smiling eyes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X