For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ''లేదురా విష్ణు'', ''పోయి పడుకో, సిగ్గుండాలి''.. బీజేపీ నేత మీద హీరో సిద్దార్ద్ ఫైర్.. అసలేమైందంటే!

  |

  కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీని సైతం కొందరు సినీ నటులు నేరుగా టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రకాష్ రాజ్ ఆ తర్వాత సిద్ధార్థ్. ముందు నుంచి ఈ ఇద్దరూ బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కరోనా పరిస్థితులు దారుణంగా మారుతున్న నేపథ్యంలో వాటిని ఆధారంగా చేసుకొని బిజెపిని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ కాస్త దూకుడు తగ్గించినా ఆ బ్యాలెన్స్ ని సిద్దార్థ్ కవర్ చేస్తున్నాడు.

  ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నుంచి సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ కి చాలా ప్రెజర్ వస్తుంది.. అయితే తాజాగా తనని ఉద్దేశించి ఒక కామెంట్ చేసిన బీజేపీ నేతకి ఆయన తీవ్రమైన పదజాలంతో కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

  సినిమాలు తగ్గిపోవడంతో

  సినిమాలు తగ్గిపోవడంతో

  తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయిన సిద్ధార్థ్ తర్వాత రోజుల్లో నేరుగా తెలుగు సినిమాలు కూడా చాలా చేశారు. కానీ ప్రస్తుతం ఆయన పెద్దగా సినిమాలు చేయడం లేదు. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ ఉండగా తెలుగులో మహాసముద్రం అనే సినిమాలో శర్వానంద్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు.

  ఇంటికే పరిమితం అయి

  ఇంటికే పరిమితం అయి

  షూటింగులు ఏమీ లేకపోవడంతో ఇంటికి పరిమితమైపోయిన నేపథ్యంలో ఆయన విరివిగా సోషల్ మీడియాని వాడుతూ ఒకపక్క కరోనాకు సంబంధించిన అంశాలలో తనకు వీలైనంత వరకూ అవగాహన కల్పిస్తూ మరో పక్క కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.. కొద్ది రోజుల క్రితం ఆయన తన ఫోన్ నెంబర్ ను బీజేపీ ఐటీ సెల్ లీక్ చేసిందని, అలా నెంబర్ లీక్ కావడం వల్ల చాలామంది ఫోన్లు చేసి తనను, కుటుంబ సభ్యులను చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరింపు కాల్ చేస్తున్నారని ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

  తేజస్వీ సూర్య మీద ఎటాక్

  తేజస్వీ సూర్య మీద ఎటాక్

  అయితే ముందు బీజేపీ పెద్దలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు కానీ రోజురోజుకు సిద్ధార్థ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్స్ పెరగడంతోపాటు బిజెపి సోషల్ మీడియా కార్యకర్తలు సైతం సిద్దార్థ్ ను టార్గెట్ చేస్తూ ఉండడంతో అగ్ర స్థాయి నేతల నుంచి సిద్ధార్ధుని పట్టించుకోవద్దని ఆదేశాలు అందాయని ప్రచారం జరిగింది. అయినా సిద్ధార్థ్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆయన బీజేపీ యువ నాయకుడు, పార్టీలో మంచి పేరున్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎంపీ తేజస్వి సూర్య చాలా ప్రమాదకరమైన వ్యక్తి, కసబ్ కంటే ఒక దశాబ్ద కాలం ముందు వ్యక్తి ఈ ట్వీట్ సేవ్ చేసుకొని ఉంచండి అంటూ ట్వీట్ చేసి చెప్పాడు.

  దావూద్ ఫండింగ్

  దావూద్ ఫండింగ్

  ఇక ఈ అంశం మీద ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ముందుగా సిద్ధార్థ కసబ్ తో తేజస్వి సూర్య ను పోల్చిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ను ఈ అంశం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. అయితే ట్విట్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేని నేపథ్యంలో ఆయన సిద్ధార్థ సినిమాలకు దావూద్ ఇబ్రహీం నుంచి ఫండింగ్ వస్తుందేమోనని అనుమానం కలుగుతోందని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని సిద్ధార్థను ప్రశ్నించాడు.

  Siddharth కి BJP కి ముదురుతున్న వైరం.. తేజస్వి సూర్య పైన కూడా !
  వెళ్లి పడుకో, సిగ్గుండాలి

  వెళ్లి పడుకో, సిగ్గుండాలి

  అయితే ఊహించని ఈ ప్రశ్నతో సిద్ధార్థకు కోపం నషాళానికంటింది. దీంతో గట్టిగానే ఫైర్ అయ్యారు. 'లేదురా ఆయన నా టిడిఎస్ కట్టడానికి రెడీగా లేడు, నేను ఒక పర్ఫెక్ట్ సిటిజన్ ని అలాగే టాక్స్ పేయర్ ని కదరా విష్ణు , వెళ్లి పడుకో బీజేపీ స్టేట్ సెక్రటరీ అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ ట్వీట్ చేశాడు. నిజానికి విష్ణు 5వ తేదీన ఈ విషయం మీద స్పందించినా సరే కాస్త లేటుగా చూసుకున్న సిద్ధార్థ మరుసటి రోజు అర్ధరాత్రి పొద్దుపోయాక ఈ మేరకు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి బీజేపీ నుంచి సిద్ధార్థ మీద ఈసారి ఎలాంటి ఎటాక్ ఉంటుందో ? సిద్ధార్థ్ మరియు సంచలన వ్యాఖ్యలు చేస్తారో వేచి చూడాలి.

  English summary
  Actor Siddharth fires on AP BJP leader vishnuvardhan Reddy
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X