twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Siddharth చెన్నై పోలీసుల సమన్లు.. ముదిరిన సైనా నెహ్వాల్‌ ట్వీట్ వివాదం

    |

    పాపులర్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీట్‌పై వివాదాస్పద కామెంట్ చేసిన సినీ నటుడు సిద్దార్థ్‌కు ఊహించినట్టే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఈ ట్వీట్ వివాదంలో సిద్దార్థ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. తాజాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో చెన్నై నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. సిద్దార్థ్‌కు ఈ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. అయితే సైనా నెహ్వాల్, సిద్దార్థ్ మధ్య చోటు చేసుకొన్న వివాదం ఏమిటంటే..

    Recommended Video

    Siddharth Tweet On Saina Nehwal ట్రోల్స్‌తో ఊచకోత| | Latest Film Updates | Filmibeat Telugu
    పంజాబ్ పర్యటనలో ప్రధానికి చేదు అనుభవం

    పంజాబ్ పర్యటనలో ప్రధానికి చేదు అనుభవం


    కొద్ది రోజుల క్రితం పంజాబ్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం ఏర్పడం అత్యంత వివాదంగా మారింది. ప్రధాని కాన్వాయ్‌కే రక్షణ లేకపోవడమేమటంటూ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ ఘటన ట్వీట్టర్‌లో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించారు. ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే.. ఏ దేశం కూడా సురక్షితంగా ఉన్నట్టు అనిపించుకోదు. ప్రధాని మోదీపై పిరికిపందల దాడిని తీవ్రంగా వ్యతిరేకించాలి. మోదీకి దేశ ప్రజలు మద్దతుగా ఉండాలి అంటూ #BharatStandsWithModi #PMModi సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.

    సైనా నెహ్వాల్ ట్వీట్‌పై సిద్దార్థ్ రియాక్షన్

    సైనా నెహ్వాల్ ట్వీట్‌పై సిద్దార్థ్ రియాక్షన్


    ప్రధాని మోదీకి సపోర్ట్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై సిద్దార్థ్ సెటైరికల్‌గా స్పందించారు. సైనా నెహ్వాల్‌ను ఉద్దేశిస్తూ.. సటిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. ఇండియాకు రక్షణగా నిలిచే వారున్నందుకు దేవుడికి థ్యాంక్ చెప్పుకోవాలి. షేమ్ ఆన్ యూ రిహన్నా అని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. అయితే Subtle Cock అనే పదాలు ఉపయోగించడం మహిళలను బూతులు తిట్టడమే.. మహిళలపట్ల సిద్దార్థ్ ఇలాంటి పదాలు వాడటం సరికాదు అంటూ నెటిజన్లు దుయ్యబట్టారు.

    తన ట్వీట్‌ను సమర్ధించుకొన్న సిద్ధార్థ్

    తన ట్వీట్‌ను సమర్ధించుకొన్న సిద్ధార్థ్


    సైనా నెహ్వాల్‌పై చేసిన ట్వీట్ వివాదం కావడం, అలాగే మహిళలు, నెటిజన్లు ఘాటుగా స్పందించడంతో సిద్ధార్థ్ మరో ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్ సరైనదే. కాక్ అండ్ బుల్ అనే పదాలు ఉదాహరణకు తీసుకోవడం తప్పేమీ కాదు. నా ట్వీట్‌లో ఎలాంటి బూతు గానీ, మహిళలను అవమానించే విధంగా పదాలు లేవు అనే విధంగా సిద్దార్థ్ మరో ట్వీట్ చేస్తూ సమర్ధించుకొన్నారు.

    చెన్నైలో సిద్దార్థ్‌పై కేసులు నమోదు

    చెన్నైలో సిద్దార్థ్‌పై కేసులు నమోదు


    సిద్దార్థ్ చేసిన ట్వీట్‌పై హైదరాబాద్‌లో ఓ మహిళ సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 509 తోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కొన్ని సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఇక చెన్నైలో కూడా సిద్దార్థ్‌పై కేసులు నమోదయ్యాయి. దాంతో ఈ సిద్దార్థ్‌కు సమన్లు జారీ చేశాం అని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైస్వాల్ మీడియాకు వెల్లడించారు.

    సమన్లు జారీ చేశాం.. స్టేట్‌మెంట్ తీసుకొంటాం

    సమన్లు జారీ చేశాం.. స్టేట్‌మెంట్ తీసుకొంటాం

    సిద్ధార్థ్ వ్యవహారంపై చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైస్వాల్ మీడియా మాట్లాడుతూ.. మాకు రెండు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్‌లో ఒక కేసు నమోదైంది. మరో ఫిర్యాదు పరువు నష్టం కేసు నమోదైంది. ఈ విషయంలో ఇప్పటికే సిద్ధార్థ్‌కు సమన్లు జారీ చేశాం. కోవిడ్ పరిస్థితులు నెలకొనడంతో ఆయన నుంచి స్టేట్‌మెంట్ ఎలా తీసుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తున్నాం శంకర్ జైస్వాల్ తెలిపారు.

    English summary
    Actor Siddharth heavily trolled for tweet against Naina Sehwal comemnts on PM Modi. In this incident, Chennai Police Commissioner Shankar Jiwal said two complaints had been received regarding Siddharth's tweet, and actor had been summoned.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X