అంతు చూస్తా.. ఎంతకైనా తెగిస్తా.. హీరో సిద్ధార్థ్‌కు డైరెక్టర్ వార్నింగ్

తనను లైంగికంగా వేధించారంటూ దర్శకుడు సుశీ గణేషన్‌పై దర్శకురాలు లీనా మణిమేకలై ఆరోపణలు చేయడం తమిళ ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మీ టూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా లీనాకు హీరో సిద్ధార్థ్ సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్‌ను, ఆయన తండ్రిని సుశీ గణేషన్ బెదిరింపులకు పాల్పడటం మరో వివాదానికి దారి తీసింది. సిద్ధార్థ్ తెలిపిన ప్రకారం..

 అంతు చూస్తానని బెదిరింపు

అంతు చూస్తానని బెదిరింపు

లీనాకు మద్దతు తెలిపిన నేపథ్యంలో సుశీ గణేషన్ తన కుటుంబాన్ని బెదిరించారు. అంతు చూస్తామని ఆయన హెచ్చరించారు. నా తండ్రికి సుశీ ఫోన్ చేసి ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించినట్టు సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలనుకొంటున్నాను అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.

నాన్నకు ఫోన్ చేసి వార్నింగ్

వృద్దాప్యంతో బాధపడుతున్న నా తండ్రికి సుశీ గణేషన్ ఫోన్ కాల్ చేశాడు. లీనాకు నేను మద్దతు తెలిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సుశీ గణేషన్ తీరు అందరికి తెలియాలి. ఏది ఏమైనా, ఎన్ని బెదిరింపులు వచ్చినా లీనా మానిమేకలైకు మద్దతు తెలియజేస్తాను. ఆమెకు అండగా ఉంటాను. బెదిరింపులకు లొంగిపోకుడా గట్టిగా పోరాటం చేయాలి అని లీనాకు సిద్ధార్థ్ మనోధైర్యాన్ని ఇచ్చారు.

వాహనంలోనే లైంగికంగా వేధింపులు

వాహనంలోనే లైంగికంగా వేధింపులు

కారులో ఇంటి వరకు దిగబెడుతానని చెప్పి నన్ను వాహనంలోనే లైంగికంగా వేధించాడు. సుశీ లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. తన స్వప్రయోజనాల కోసం ఎవరినైనా బెదిరిస్తాడు అని లీనా ఆరోపణలు చేసింది. లీనా వ్యాఖ్యలపై సుశీ గణేషన్ ఘాటుగా స్పందించాడు.

చట్టపరంగా చర్యలని సుశీ హెచ్చరిక

చట్టపరంగా చర్యలని సుశీ హెచ్చరిక

లీనా చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. పబ్లిసిటీ కోసం మగవాళ్లను దూషించడం, వారిపై బురద జల్లడం మహిళలకు ఫ్యాషన్ అయిపోయింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన లీనాపై చట్టపరమైన చర్యలు తీసుకొంటానని సుశీ హెచ్చరించాడు.

బెదిరిస్తే బయపడేది లేదని

బెదిరిస్తే బయపడేది లేదని

సుశీ బెదిరింపుల నేపథ్యంలో లీనా మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబానికి భద్రత అవసరం. బెదిరించిన సుశీపై తన వ్యాఖ్యల్లో ఎలాంటి మార్పు ఉండదు. గణేషన్ తీరును బయటపెట్టడం వల్ల అన్యాయానికి గురవుతున్న మహిళలకు ధైర్యం కలుగుతుంది అని లీనా పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X