»   » బీప్ సాంగ్ వివాదం: పోలీసుల ముందు శింబు లొంగుబాటు!

బీప్ సాంగ్ వివాదం: పోలీసుల ముందు శింబు లొంగుబాటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శింబు ‘బీప్ సాంగ్' వివాదంలో చిక్కుకోవడం, పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిన శింబు ఎట్టకేలకు సోమవారం పోలీసుల ముందు లొంగిపోయారు. శింబు సోమవారం ఉదయం తన తండ్రి టి రాజేంద్రన్, లాయర్లతో కలిసి వచ్చి లొంగిపోయారు.

ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. ఈ వివాదంతో నాకు సంబంధం లేదని, పూర్తిగా అమాయకుడిని అని శింబు చెప్పుకొచ్చారు. ఈ కేసు విచారణలో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు.

Actor Simbu appears before police in Beep song case

ఏమిటీ బీప్ సాంగ్ వివాదం....
‘బీప్' సాంగ్ వ్యవహారంపై తమిళ నాడులో పెద్ద వివాదానికి దారి తీసింది. మహిళలను కించపరిచే విధంగా బీప్ సాంగ్ ఉండటంతో మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు అతనికి వ్యతిరేకంగా ఆందోళన చేసాయి. పలు చోట్ల శింబు దిష్టిబొమ్మలు దగ్దం చేయడంతో పాటు అతన్ని కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేసారు. కొందరైతే ఉరితీయాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం.

మీడియా ముందు తల్లి ఆవేదన...
శింబు వ్యవహారం తీవ్రం కావడంతో అప్పట్లో....మీడియా ముందు శింబు తల్లి ఉష కంటతడిపెట్టుకున్నారు. నా కొడుకు ఏం తప్పు చేసాడు? వాడు ఇంకా చిన్న కుర్రాడే, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అది ఆకతాయితనంతో చేసిన పాట. అది బాగోలేక పోవడంతో పక్కన పడేసాడు. ఎవరో గిట్టని వాళ్లు దాన్ని దొంగలించి బయట పెట్టారు...ఎవరో పాట దొంగిలిస్తే నా కొడుకును ఉరితీస్తారా? అంతకంటే ముందు నా ప్రాణం తీసుకోండి అంటూ ఎమోషనల్ గా స్పందించారు.

Actor Simbu appears before police in Beep song case

నా కొడుకు ఏ తప్పూ చేయలేదు, ఆ పాటను ఎక్కడా పబ్లిక్ గా పాడలేదు. దాన్ని ఎవరో కావాలని దొంగిలించి అతనిపై కుట్ర చేసారు. శింబు ఎదగకుండా తోటి నటులే కుట్ర చేస్తున్నారు. ఇదేం రాష్ట్రం. ఓ వైపు వరద బాదితులు తిండిలేక అలమటిస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా నా కొడుకు ఏదో ఘోరం చేసినట్లు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో మేం బ్రతకలేం...వేరే రాష్ట్రానికి వెళ్లి మా బతుకులు మేము బ్రతుకుతాం. మమ్మల్ని ఇంతవారిని చేసిన తమిళనాడుకు థాంక్స్ అంటూ....శింబు తల్లి ఉష తల్లి కంటతపడి పెట్టడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

English summary
Kollywood Actor, Simbu appeared at the Kattoor Police Station in connection with the controversial "Beep Son"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu