స్టార్ హీరో కారు భీబత్సం.. స్పాట్లో వ్యక్తి మృతి.. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు... కానీ?
ఈ మధ్యకాలంలో హీరో శింబు అనూహ్య కారణాలతో వార్తల్లో నిలుస్తున్నారు.. ఒక ప్రముఖ హీరోయిన్ తో ఆయన పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన కారు ప్రమాదం కారణంగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నిజానికి శింబు కారు ప్రమాదానికి గురైంది కానీ దానిలో శింబు లేరు. అయినా సరే ఒక సినిమా హీరోకి సంబంధించిన కారు ప్రమాదానికి కారణం కావడంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

శింబు డ్రైవర్ అరెస్ట్
ప్రముఖ తమిళ హీరో శింబు కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం సదరు డ్రైవర్ శింబు కారుతో యాక్సిడెంట్ చేయడమే. అయితే ఈ రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో శింబు ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు ఆ కారు యాక్సిడెంట్స్ జరిగిన సమయంలో ఆయన తండ్రి - దర్శకుడు టి. రాజేంద్రన్ ఉన్నట్టు తెలుస్తోంది.

కారు బీభత్సం
చెన్నైలో గత శుక్రవారం నాడు ఒక కారు బీభత్సం సృష్టించింది. అయితే ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ఎలాంగో సలై పోయెస్ రోడ్ జంక్షన్ లో మార్చి 18న జరిగిన యాక్సిడెంట్ వీడియో ఒకటి చాలా ఆలస్యంగా అంటే ఏకంగా వారం తరువాత బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 70 ఏళ్ళ వ్యక్తి మీదకు కారు దూసుకు వెళ్లడంతో, సదరు వ్యక్తికి గాయాలు అయ్యాయి.

సీసీ కెమెరాల్లో
ఆ దృశ్యాలు అన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీడియోలో ఉన్న ఇన్నోవా కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇన్నోవా ఢీ కొట్టడంతో గాయాలు అయిన వ్యక్తి పేరు మునుస్వామి అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడుపుతున్న డ్రైవర్ కారు దిగి పరారు అయినట్టు గుర్తించారు. అతడిని గుర్తించి తాజాగా అరెస్ట్ చేసినట్టు చెన్నై వర్గాల కథనం.

ఆస్పత్రికి పంపారని
అయితే... శింబు తండ్రి టి. రాజేంద్రర్ అంబులెన్స్ కి ఫోన్ చేసి డ్రైవర్ చేత మునుస్వామిని ఆస్పత్రికి పంపారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఆస్పత్రికి తీసుకువెళ్లినా మునుస్వామి తీవ్ర గాయాల కారణంగా మరణించారు. కారు శింబు పేరు మీద రిజిస్టర్ కావడంతో ఈ విషయం మీద మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఇక ఈ అంశం మీద కేసు నమోదు చేసుకున్న చెన్నైలోని పాండీ బజార్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

వరుస సినిమాలు
సెక్షన్ 337, 297, 304 (ఏ) కింద కేసులు పెట్టి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. చివరిగా మానాడు అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శింబు ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకొని తమిళ సినీ పరిశ్రమలో మళ్లీ తిరిగి టాప్ హీరోగా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఆయన పెళ్లి కూడా త్వరలో జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











