కూల్ డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి అత్యాచారం.. సినీ నటుడి కొడుకు అకృత్యం!
తమిళ నటుడి కుమారుడిపై రేప్ కేసు నమోదు కావడం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనపై లైంగిక దాడి చేశారంటూ తమిళ నటుడు కుమారుడిపై ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు అందుకొన్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమిళ నటుడు కుమారుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

సినీ నటుడు సూర్యకాంత్ కుమారుడిపై
చెన్నై పోలీసుల తెలిపిన ప్రకారం.. బీకాం చదువుతున్న ఓ అమ్మాయి తనపై రేప్ చేశాడని వాన్నార్‌పేట్‌లో ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో అన్నానగర్‌కు చెందిన విజయ్ హరీష్‌పై కేసు నమోదు చేసింది. విజయ్ హరీష్ నటుడు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత సూర్యకాంత్ కుమారుడు. అయితే తన కుమారుడిని ఈ కేసు నుంచి తప్పించడానికి సూర్యకాంత్ అధికార ఎన్నాడీఎంకే నేతలతో ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

కూల్ డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి..
బాధితురాలు తెలిపిన ప్రకారం... విజయ్ హరీష్ తనను విరుగమ్‌బాకమ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు జనవరి 2న తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి తన కోరికలు తీర్చాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేకపోతే తన వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు అని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపారు.

కుట్రలో భాగంగానే
కాగా, సూర్యకాంత్ తనయుడు విజయ్ హరీష్‌పై ఆరోపణలు రావడంతో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. అయితే తమ ప్రతిష్ఠను దిగజార్చేందుకు జరిగిన కుట్రలో భాగంగానే తన కుమారుడిపై కేసు నమోదైందని సూర్యకాంత్ ఆరోపించడం గమనార్హం. అయితే ఈ కేసులో తన కుమారుడిపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బాధితురాలితో సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
Recommended Video


నటుడు సూర్యకాంత్ గురించి
కాగా, నటుడు సూర్యకాంత్ ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. చూడటానికి సూర్యకాంతం అచ్చు రజనీకాంత్ మాదిరిగా ఉంటారు. పలు సినిమాల్లోనూ, టెలివిజన్ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించారు. ఆ తర్వాత ఎన్నాడీఎంకేలో చేరి పార్టీకి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యకాంత్ కుమారుడు ఇలాంటి కేసులో చిక్కుకోవడం పార్టీలోనూ, సినీ రంగంలోనూ చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











