twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉదయనిధి స్టాలిన్‌కు బంపర్ మెజార్టీ.. డిప్యూటీ సీఎంగా యువ హీరో అంటూ జోరుగా వార్తలు!

    |

    తమిళనాడులో అందరూ ఊహించినట్టుగానే ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారాన్ని చేపట్టబోతున్నది. ఇక మొదటి నుంచి విజయం తథ్యమని ధీమాగా ఉన్న స్టాలిన్ తనయుడు, యువ హీరో ఉదయనిధి స్టాలిన్ బంపర్ మెజారిటీతో గెలుపు సాధించారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన గురించి వస్తున్న రుమర్లు, గెలుపు గురించి మరింత సమాచారం మీ కోసం..

    Recommended Video

    Kamal Haasan, Kushboo Had Lost In Tamilnadu Assembly Elections 2021 | Filmibeat Telugu
    ఏకంగా నరేంద్రమోదీనే టార్గెట్ చేస్తూ..

    ఏకంగా నరేంద్రమోదీనే టార్గెట్ చేస్తూ..

    తమిళనాడులో ఎన్నికల సంగ్రామం ప్రారంభమైనప్పటి నుంచే ఉదయనిధి మారన్ అందర్ని ఆకట్టుకొంటూ వస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలుపైనే కాకుండా ప్రధాని నరేంద్రమోదీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ తన రాజకీయ ఉత్సాహాన్ని బయటపెట్టుకొన్నారు. దాంతో మీడియానే కాకుండా సినీ, రాజకీయ వర్గాల చూపు ఆయనపై పడింది.

    ఎయిమ్స్ ఇటుకతో మీడియాలో హైలెట్‌గా

    ఎయిమ్స్ ఇటుకతో మీడియాలో హైలెట్‌గా

    చెన్నై నగరంలోని ప్రధాన నియోజకర్గమైన చెపాక్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఉదయనిధి స్టాలిన్ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులో ఎయిమ్స్ హాస్పిటల్‌కు పునాది రాయి వేసిన ప్రధాని నరేంద్రమోదీ ఆ సంగతి మరిచిపోయారంటే.. ఎయిమ్స్ శంకుస్థాపన స్థలం నుంచి ఇటుకను తీసుకొచ్చి మీడియాలో హైలెట్‌గా మారారు.

    ఉదయనిధి స్టాలిన్‌పై దొంగతనం కేసు

    ఉదయనిధి స్టాలిన్‌పై దొంగతనం కేసు


    ప్రతిపాదిత ఎయిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నుంచి ఇటుకను తీసుకొచ్చిన ఉదయనిధి స్టాలిన్‌పై బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎయిమ్స్ అని రాసిన ఇటుకను దొంగతనం చేశారంటూ ఉదయనిధిపై కేసు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇలాంటి వివాదాల మధ్య ఉదయనిధి స్టాలిన్ తన ప్రచారాన్ని కొనసాగించారు.

    25 రౌండ్ల లెక్కింపులో 68 వేల మెజారిటీ

    25 రౌండ్ల లెక్కింపులో 68 వేల మెజారిటీ


    తాజాగా ఆదివారం (మే 2వ) తేదీన ప్రకటించిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఉదయనిధి స్టాలిన్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 25 రౌండ్లపాటు సాగిన కౌంటింగ్‌లో చెపాక్ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థిపై 68 వేలకుపైగా ఓట్ల మెజారిటీ విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ఉదయనిధి స్టాలిన్ విజయం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం కాబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఉదయనిధి మారన్ ఆ పదవి చేపట్టబోతున్నారా అనేది వేచి చూడాల్సిందే.

    ఫలితాల సమయంలో ఉదయనిధి ట్వీట్ వైరల్

    ఫలితాల సమయంలో ఉదయనిధి ట్వీట్ వైరల్

    ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఉదయనిధి స్టాలిన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. పార్టీ సాధించిన విజయానికి చిహ్నంగా తన తండ్రికి ఎయిమ్స్ అని రాసిన ఇటుకను ఉదయనిధి స్టాలిన్ బహుకరిస్తున్న ఫోటో మీడియాలో హైలెట్ కాగా, సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది.

    English summary
    Actor Udhayanidhi Stalin won with Big Majority at the Chepauk constituency in Chennai. He won over AIDMK Candidates. Udhayanidhi Stalin has got 68 thousand votes majority.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X