నా తండ్రి చేసింది న్యాయమా? విజయ్ కుమార్‌పై కూతురు ఫైర్.. వనిత కోసం గాలింపు
సీనియర్ నటుడు విజయ్ కుమార్, తన కూతురు వనిత మధ్య ఆస్తి గొడవ ముదురుతున్నది. తన ఇంటిని ఆక్రమించుకొన్నదని స్వయంగా కూతురు వనితపై విజయ్ కుమార్ చెన్నై మధురువాయిల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనితను విచారించడానికి వచ్చిన క్రమంలో ఆమె అనుచరులు పోలీసుల దాడి చేయడం వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కుమార్‌పై కూతురు వనిత కేసు నమోదు చేయడం ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే..

విజయ్ కుమార్ ఫిర్యాదుతో
విజయ్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో చెన్నై అష్టలక్ష్మీ నగర్‌లోని విజయ్ కుమార్ ఇంటికి వచ్చి వనితను విచారించారు. ఆ సందర్భంగా ఇంట్లో కూడా నాకు కూడా భాగం ఉంది. ఇళ్లు ఖాలీ చేయను అని వనిత పోలీసులతో వాదించింది. ఆ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులుపై వనిత అనుచరులు దాడి చేయడం మరింత వివాదంగా మారింది.

పోలీసులపై అనుచరుల దాడి
మీడియా ప్రతినిధులపై దాడి వివాదం తర్వాత మరోసారి వనితను విచారించడానికి పోలీసులు రావడం మరో వివాదానికి దారి తీసింది. ఇళ్లు ఖాళీ చేసేది లేదు అని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఇంట్లోని వస్తువులను వనిత అనుచరులు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. పోలీసులపై దాడికి కూడా దిగడంతో పోలీసులు వనిత, అమె అనుచరులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వనిత తప్పించుకోవడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు.

విజయ్ కుమార్‌పై కూతురు కేసు
పోలీసుల గాలింపుల మధ్య తాజాగా చెన్నైలోని పడపళినిలోని పోలీస్ స్టేషన్లో తండ్రి విజయ్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. తనను కిరాయి మనుషులతో కొట్టిస్తున్నాడని తండ్రిపై ఆరోపణలు చేసింది. అర్ధరాత్రి అని చూడకుండా ఇంటి నుంచి గెంటి వేశాడని చెప్పాడు. తనను ఇంట్లో ఉండకూడదని వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తండ్రి చేసింది న్యాయమా
సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఉండటానికి నివాసం లేదు. అందుకే అమ్మ ఇంటికి వచ్చానని చెప్పింది. తన తండ్రి విజయకుమార్ కూతురని కూడా చూడకుండా తనను అర్ధరాత్రి బయటకు గెంటించేశాడు. ఓ కూతురి పట్ల ఇలా చేయడం న్యాయమా అని కంటతడి పెట్టింది.


Click it and Unblock the Notifications











