కూతురుపై తండ్రి ఫిర్యాదు.. హీరోయిన్ అరెస్ట్.. రహస్య ప్రాంతానికి తరలింపు

సీనియర్ నటుడు విజయ్ కుమార్, అతని కూతురు నటి వనిత మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే మండే స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తండ్రి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు నటి వనితను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వనిత ఎక్కడ ఉందో అనే విషయం సస్పెన్స్‌గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన వివాదానికి కారణం ఇదే..

తండ్రి భవనం కబ్జా

తండ్రి భవనం కబ్జా

సీనియర్‌ నటుడు విజయకుమార్‌కు చెన్నై ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్‌ 19వ వీధిలో పెద్ద భవంతి ఉంది. దానిని షూటింగ్‌ల కోసం అద్దెకు ఇస్తుంటారు. అలా తండ్రి విజయకుమార్‌ ఆధీనంలో ఉన్న భవనాన్ని కూతురు, నటి వనిత అద్దె కోసం అనుమతి తీసుకొంది. షూటింగ్ తర్వాత ఆ భవనాన్ని ఆక్రమించింది.

ఆక్రమించిన కూతురిపై ఫిర్యాదు

ఆక్రమించిన కూతురిపై ఫిర్యాదు

తన కూతురు ఆక్రమణలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని గతంలో విజయకుమార్‌ చెన్నై పోలీసులను ఆక్రమించారు. వనితను ఇల్లు ఖాళీ చేయించి అప్పగించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు మధురవాయిల్‌ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గతంలోనే వివాదం

గతంలోనే వివాదం

నటుడు విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వనితను అరెస్ట్‌ చేయడానికి ఆ ఇంటికి వెళ్లారు. వనిత పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కొందరు పోలీసులపై చేయి కూడా చేసుకోవడంతో పరిస్థితి చేజారినట్టు మీడియా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత వనిత అక్కడి నుంచి పరారైంది.

కూతురిపై విజయ్ కుమార్ మళ్లీ..

కూతురిపై విజయ్ కుమార్ మళ్లీ..

ప్రస్తుత పరిస్థితుల్లో నటుడు విజయకుమార్‌ శుక్రవారం మళ్లీ కూతురు వనితపై మధురవాయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను తన ఇంటి నుంచి ఆమెను ఖాళీ చేయాల్సిందని వేడుకొన్నారు. దాంతో పోలీసులు వనిత ఉంటున్న ఇంటికి వచ్చి ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమెను పోలీసులు ఓ రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X