twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ అభిమాని అరెస్ట్.. ఫేస్‌బుక్‌లో ఆయనను తిట్టినందుకు.. మెర్సల్‌200

    By Rajababu
    |

    తమిళ సూపర్‌స్టార్ నటించిన మెర్సల్‌పై వివాదాల వెల్లువ, కలెక్షన్లు వసూళ్లు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వివాదం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీని దూషించిన విజయ్ అభిమానిని సోమవారం అరెస్ట్ చేయడం తమిళనాడులో సంచలన వార్తగా మారింది. ఈ ఘటన విరుధునగర్ జిల్లా శ్రీవిల్లిపుథూర్ పట్టణంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళితే..

     ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

    ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్

    ఇంజినీరింగ్ విద్యార్థి తిరుమురుగన్ (19) అనే వ్యక్తి విజయ్ అభిమాని. ఇటీవల బీజేపీ నేత మారిముత్తుతో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో సంభాషణ జరిగింది. అయితే ఆ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీని తీవ్రంగా దూషించడట. దాంతో తిరుమురుగన్‌పై మారిముత్తు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఫేస్‌బుక్ సంభాషణ ఆధారంగా తిరుమురుగన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

    ఫేస్‌బుక్ సంభాషణపై ఫిర్యాదు

    ఫేస్‌బుక్ సంభాషణపై ఫిర్యాదు

    ఫేస్‌బుక్ సంభాషణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై విపరీతంగా వారి మధ్య చర్చ జరిగిందట. ప్రధాని మోదీపై తిరుమురగన్ చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా మనస్తాపానికి గురైన మారిముత్తు పోలీసులకు ఫేస్‌బుక్ సంభాషణను అందజేశారనేది తాజా సమాచారం. బీజేపీ నేత అందజేసిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

    నిజమేనని ఒప్పుకొన్నాడు..

    నిజమేనని ఒప్పుకొన్నాడు..

    తిరుమురుగన్‌ను విచారించగా పలు విషయాలను వెల్లడించారు. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకొన్నారు. ఐటీ యాక్టు 2000, సెక్షన్ 67 ప్రకారం తిరుమరుగన్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం. వెంటనే శ్రీవిల్లిపుథూర్‌లోని రెండో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టాం అని చెప్పారు. తిరుమురుగన్ అరెస్ట్‌తో స్థానికంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు సమాచారం.

     200 కోట్ల క్లబ్‌లో మెర్సల్

    200 కోట్ల క్లబ్‌లో మెర్సల్

    కాగా, విజయ్ నటించిన మెర్సల్ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. జీఎస్టీ తర్వాత 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. రెండు వారాలు గడిచినా మెర్సల్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టకపోవడం ఆ చిత్రానికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను చెబతున్నదనే మాట వ్యక్తమవుతున్నది.

    English summary
    A fan of actor Vijay was arrested on Monday for abusing the Prime Minister Shri. Narendra Modi, in a chat with a BJP functionary on 'Facebook messenger' at Srivilliputhur town in Virudhunagar district. The Srivilliputhur town police arrested Thirumurugan (19), an engineering diploma holder based on the complaint from Marimuthu, BJP, Virudhunagar district secretary. The police booked him under section 67 of the Information Technology Act, 2000 (Punishment for publishing or transmitting obscene material in electronic form) and remanded Thirumurugan to judicial custody after producing him in the Judicial magistrate court II in Srivilliputhur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X