సంచలనంగా మారిన విజయ్ కామెంట్స్.. అభిమానుల సమక్షంలో.. నేను సీఎం అయితే!

Recommended Video

Actor Vijay Hints At Entry Into Politics

తమిళ స్టార్ హీరో విజయ్ అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు ఉన్నారు. ఇటీవల విజయ్ వరుస ఘనవిజయలతో దూసుకుపోతున్నాడు. తేరి, మెర్సల్ వంటి చిత్రాలు అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శత్వంలో తెరకెక్కుతున్న సర్కార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

 భారీ అంచనాలు

భారీ అంచనాలు

మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో ఇప్పటికే కత్తి, తుపాకీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సందేశాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో మురుగదాస్ ప్రతిభావంతుడు.

 అభిమానుల సమక్షంలో

అభిమానుల సమక్షంలో

ఇటీవల జరిగిన సర్కార్ ఆడియో వేడుకలో మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఒకేవలా తానే ముఖ్యమంత్రిని అయితే సినిమాలలో లాగా ప్రవర్తించనని తెలిపాడు. అవినీతినిఫై పోరాటానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు. అభిమానుల సమక్షంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో భవిషత్తులో అతడు రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

అవినీతి ముఖ్యమంత్రి

అవినీతి ముఖ్యమంత్రి

తమిళ వినివర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సర్కార్ చిత్రంలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ పాత్ర అవినీతిని ప్రోత్సహించే కోణంలో ఉంటుందని అంటున్నారు.

అభిమానుల కోరిక

అభిమానుల కోరిక

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమ అభిమాన హీరో కూడా రాజకీయాల్లోకి రావాలని విజయ్ ఫాన్స్ ఇప్పటికే ఆకాంక్షిస్తున్నారు. విజయ్ తన వ్యాఖ్యలతో భవిష్యత్తులో తన రాజకీయ ఎంట్రీ ఉంటుందని పరోక్షంగా వెల్లడించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X