అక్రమంగా లగ్జరీ కార్లు కొన్న ఇద్దరు హీరోలపై సీబీ’ఐ‘?
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, నిర్మాత గా కెరీర్ ప్రారంభించి హీరోగా టర్న్ అయిన ఉదయ నిధి స్టాలిన్‌లకు చెందిన లగ్జరీ కార్ల గురించి సిబిఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు తమిళనాడులోని 20 ప్రాంతాల్లో వీరికి సంబంధించిన కార్యలయాలు, ఇళ్లపై ఏకకాలంలో గురువారం ఉదయం సోదాలు నిర్వహించినట్లు సమాచారం. వీరు విదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారంటూ డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీబీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
హీరో విజయ్ వద్ద కోట్ల రూపాయల విలువ చేసే రీగల్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉంది. అదే విధంగా ఉదయ నిధి స్టాలిన్ వద్ద కూడా కోట్ల రూపాయల విలువ చేసే హమ్మర్ హెచ్ 3 కారు ఉంది. గత సంవత్సర కాలంగా ఇండియాకి దిగుమతి అయిన కార్లపై కూడా అధికారుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలువురికి చెందిన లగ్జరీ కార్లపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలు కూడా అక్రమంగా విదేశీ లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారని తేలితే చిక్కుల్లో పడటం ఖాయం. ఉదయ నిధి స్టాలిన్ తమిళనాడు డిఎంకె పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు ఎం.కె. స్టాలిన్ తనయుడుకావడంతో సీబీఐ దాడుల వెనక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఈ రోజు ఉదయం హీరో ఉదయ నిధి స్టాలిన్, అతని తండ్రి ఎంకె. స్టాలిన్ ఇళ్లపై సిబిఐ దాడులు జరుగడం అందరినీ షాక్ కు గురి చేసింది.

రాజకీయ నాయకుల ఇళ్ల సంగతి పక్కన పెడితే సినీ తారల ఇళ్లపై సీబీఐ దాడులు చేయడం వారి అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది.

ప్రస్తుతం విజయ్ ‘తలైవా' అనే చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో అమల పాల్ కీ రోల్ చేస్తోంది.

ఉదయ నిధి స్టాలిన్ ఇటీవల ఓకే ఓకే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

ప్రస్తుతం ఉదయ నిధి స్టాలిన్ ప్రస్తుతం ఎస్ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో Idhu Kathirvelan Kadhal అనే సినిమా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











