సొంత కూతురు మీదే పోలీస్ కంప్లయింట్ చేసిన విజయ్ కుమార్!
సౌతిండియా సీనియర్ యాక్టర్ విజయ్ కుమార్ తన సొంత కూతురు మీదే పోలీస్ కంప్లయింట్ చేయడం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. విజయ్ కుమార్, అతడి నాలుగవ కుమార్తె వణితకు చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది.
సినిమాలు నిర్మిస్తున్న వణిత... తన తండ్రి విజయ్ కుమార్‌కు చెందిన చెన్నై అలపాక్కంలోని ఓ ఇంటిని సినిమా షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. అయితే షూటింగ్ పూర్తయినా ఆమె ఇంటిని ఖాళీ చేక పోగా.... ఇది తన ఆస్తి అని, దీన్ని ఖాళీ చేయడం కుదరదు అని గొడవకు దిగినట్లు సమాచారం.
దీంతో విజయ్ కుమార్ చెన్నైలోని మదురవోయిల్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే తన ఇంటి నుండి వణితను ఖాళీ చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సొంత కూతురుపైనే తండ్రి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది.

విజయ్ కుమార్‌కు మొత్తం 6 ఆరుగురు సంతానం. కవిత, అనిత, అరుణ్ విజయ్, వనిత, ప్రీత, శ్రీదేవి. వరుణ్ విజయ్ తమిళ చిత్రాల్లో హీరోగా, విలన్‌గానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన 'చిక్క చివంత వానమ్' సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమవుతోంది. వనిత, ప్రీత, శ్రీదేవి సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లి తర్వాత నటనకు దూరం అయ్యారు.


Click it and Unblock the Notifications











