నా చావుపై కూడా పాలిటిక్సా? మనిషివా? పశువువా? యాక్టర్‌పై విజయలక్ష్మి ఆగ్రహం

తమిళ నటి విజయ లక్ష్మీ ఆత్మహత్యకు ప్రయత్నించడం కోలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది. సూసైడ్‌కు ప్రయత్నించిన ఆమెను హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న విజయలక్ష్మీ హాస్పిటల్ నుంచి మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. తన మరణానికి కూడా రాజకీయం చేయాలనుకొంటున్న నటుడు సీమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే...

విజయ్ లక్ష్మీ సూసైడ్ కలకలం

విజయ్ లక్ష్మీ సూసైడ్ కలకలం

నటి విజయలక్ష్మీ ఆదివారం సూసైడ్‌కు ప్రయత్నించడం తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకొనే ముందు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో నామ్ ఫామిలియర్ కచ్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్‌, అలాగే మరో నేత హరీ నాడార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన మరణానికి వీరిద్దరే కారణమంటూ వీడియోలో విమర్శలు చేసింది.

మీ ప్రేమ వల్లే బతికాను

మీ ప్రేమ వల్లే బతికాను

విజయలక్ష్మీ తాజాగా హాస్పిటల్‌ నుంచి మరో వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. మీ అందరి ప్రేమ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను. నా ఆరోగ్యం బాగున్నది. నా చావును కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. సీమాన్ లాంటి వాళ్లు కూడా ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు. అలాంటి వాళ్ల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకోవాలనుకొన్నాను అని విజయలక్ష్మీ తన వీడియోలో పేర్కొన్నారు.

నా ఆత్మహత్యపై కూడా రాజకీయాలు

నా ఆత్మహత్యపై కూడా రాజకీయాలు

నేను రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారానని ఆరోపణలు చేయడం మరీ బాధిస్తున్నది. కొంచెమైనా మానవత్వాన్ని చూపండి. నేను ఆత్మహత్య చేసుకోవడం ఓ డ్రామా అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నా ఆరోగ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. బీపీ, హార్ట్ రేట్ పడిపోతున్నది. ఒకరి కోసం నా ప్రాణాలు పణంగా పెట్టి డ్రామాలు ఆడుతానా? అని విజయలక్ష్మీ అన్నారు.

సీమాన్ మనిషా? పశువా?

సీమాన్ మనిషా? పశువా?

సీమాన్ ప్రవర్తన, తీరుతో విసిగిపోయాను. ఆయన మనిషేనా లేక పశువువా? నా సూసైడ్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నాడు. నా గుంచి చెడుగా రాయద్దు. నేను దిగజారే వ్యక్తిని కాదు. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని ఎదురించలేక సతమతమవుతున్నాను. దయచేసి నా గురించి చెడుగా రాయకండి. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను అని విజయలక్ష్మీ పేర్కొన్నారు.

Recommended Video

Lakshmi Manchu, Rana Daggubati Funny Talk On Rana's Wedding
బీపీ టాబ్లెట్లు మింగి సూసైడ్ అటెంప్ట్

బీపీ టాబ్లెట్లు మింగి సూసైడ్ అటెంప్ట్

తమిళనాడు, పాండిచ్చేరిలోని నామ్ తమిళర్ కచ్చి నేత, నటుడు సీమాన్ వ్యవహారంతో విజయలక్ష్మీ ఆత్మహత్యకు ప్రయత్నించారు. మోతాదుకు మించి బీపీ టాబ్లెట్స్ మింగడం, ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఇక హరి నాడార్ పనన్ కట్టు పడై అనే సంస్థను నడుపుతున్నారు. ఇటీవల నంగునేరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి హరి నాడార్ ఓటమి పాలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X