twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడేళ్ల తరువాత 'నడిగర్‌ సంఘం' ఓట్ల లెక్కింపు.. రెండోసారి గెలిచిన విశాల్‌, కార్తీ

    |

    మన తెలుగు నటీనటులకు ఎలా అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఉందో అలాగే తమిళనాడులో నడిగర్ సంఘం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIFAA) ప్రసిద్ధి చెందింది. దానికి సంబంధించి 2019లో ఎన్నికలు జరిగాయి. అయితే అప్పటి నుంచి వాయిదా పడిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు జరిగింది. 2019 జూన్‌ 23వ తేదీన చెన్నై మైలాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరగగా ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 2019లో నడిగర్‌ సంఘం ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ సెక్రటరీగా ఒక ప్యానల్‌ నుంచి కె. భాగ్యరాజ్‌ అధ్యక్షుడిగా, గణేశన్‌ సెక్రటరీగా మరో ప్యానల్‌ నుంచి పోటీ చేశారు.

    ఓటింగ్‌లో హీరో విశాల్‌ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందడంతో మద్రాస్‌ కోర్టు కౌంటింగ్‌ను ఆపేసింది. అయితే ఈ క్రమంలోనే అనేక వాయిదాల అనంతరం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇంతకు ముందు జరిగిన సంఘం ఎన్నికలు చెల్లవని, సంఘ నిర్వాకం గడువు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని వెల్లడించారు. సంఘానికి మూడు నెలల్లోపు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. సంఘం సభ్యుల పట్టికను కొత్తగా తయారు చేయాలని, ఎన్నికల పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ను నియమిస్తున్నట్లు కూడా వెల్లడించింది కోర్టు. ఒకరకంగా జస్టిస్ కె.కల్యాణ సుందరం జనవరి 2020లో, జూన్ 23, 2019న జరిగిన ఎన్నికలను రద్దు చేశారు.

    Actor vishal and karthis team wins Nadigar sangam election

    దీంతో నడిగర్ సంఘం ఎన్నికల్లో విజేతలు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన ఆ ఎన్నికల్లో చెల్లబాటవుతున్నాయని మద్రాస్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. ఇక ఆ ప్రకటించిన దాని మేరకు ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. అలా దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి.

    నడిగర్‌ సంఘం అధ్యక్షుడిగా నాజర్‌ రెండోసారి విజయఢంకా మోగించగా ప్రధాన కార్యదర్శిగా విశాల్‌ రెండోసారి గెలుపొందాడు. నడిగర్‌ సంఘం ట్రెజరర్‌గా కార్తీ విజయం సాధించాడు. ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షతన పాండవర్‌ పేరుతో ఒక జట్టు, దర్శక నటుడు కే.భాగ్యరాజ్‌ అధ్యక్షతన స్వామి శంకరదాస్‌ పేరుతో ఒక జట్టు పోటీ పడ్డాయి. అయితే ఎన్నికలు జరిగినా కూడా ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టలేదు.

    English summary
    Actor vishal and karthi's team wins Nadigar sangam election.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X