Vishal Health Bulletin: వేదికపై కుప్పకూలిన హీరో విశాల్.. ఐసీయూకు తరలింపు (వీడియో)

దక్షిణాది సినీ హీరో విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తమిళనాడులోని ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న అతను ఉన్నట్టుండి వేదికపైనే కుప్పకూలాడు. ఆ వేదిక వద్ద ఉన్న ప్రముఖులు, అభిమానులు ఆయనకు ప్రాథమిక చికిత్సను అందించిన వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఇటీవల కాలంలో పలుమార్లు ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజా సంఘటన గురించి హాస్పిటల్ వర్గాలు వెల్లడించిన హెల్త్ బులెటిన్ వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ హీరో విశాల్ కొద్ది నెలలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మద గజరాజ సినిమా ప్రమోషన్స్ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యంతోనే ఆయన ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో చేతులు, కాళ్లు వణుకుతూ కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. ఆ సమయంలో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే కొద్ది రోజులుగా కోలుకొన్నట్టు కనిపించిన ఆయన తాజాగా వేదికపైనే పడిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.

Vishal

ఆదివారం చెన్నైకి సమీపంలోని విల్లుపురంలో ట్రాన్స్ జెండర్లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన స్టేజ్‌పై హుషారుగా కనిపించాడు. కానీ అకస్మాత్తుగా ఆయన స్టేజ్‌పైన సృహతప్పి పడిపోయాడు. ఆయన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయన టీమ్ మెంబర్స్, అనుచరులు లేపి సపర్యలు చేశారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయనను ప్రముఖ హస్పిటల్‌కు తరలించారు.

వైద్య నిపుణులు అందించిన సమాచారం మేరకు.. చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. అయితే ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆయన హెల్త్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుల బృందం త్వరలోనే హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు అని ఆయన సన్నిహితులు తెలిపారు.

విశాల్ ఆరోగ్య పరిస్థితి బాగుంది. 6 గంటల సమయంలో విల్లుపురంలో కుప్పకూలాడు. మాజీ మంత్రి వెంటనే స్పందించి ఆయనను సమీపంలోని హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు జరిపిన తర్వాత ఉపవాసం చేయకూడదని సలహా ఇచ్చారు. సమయానికి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొంటారు అని ఆయన సన్నిహితుడు తెలిపారు. అలాగే విశాల్ మేనేజర్ హరి కూడా స్పందించి.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. ట్రాన్స్ జెండర్స్ సభకు ముఖ్య అతిథిగా వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఉపవాసంలో ఉన్న ఆయన సృహతప్పి కిందపడిపోయాడు అని తెలిపారు.

విశాల్ అస్వస్థతకు గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. దాంతో హీరో విశాల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి సినీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

More from Filmibeat

Read more about: vishal kollywood madha gaja raja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X