»   » అడుక్కునే పరిస్థితి, నా తండ్రిలా ఎవరూ కాకూడదు: విశాల్

అడుక్కునే పరిస్థితి, నా తండ్రిలా ఎవరూ కాకూడదు: విశాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు విశాల్ ఏప్రిల్ 2న జరగనున్న తమిళ సినీ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్ష పదవికి విశాల్ పోటీ చేస్తున్నాడు. తాను పోటీ చేయడానికి కారణం చిన్న నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే అంటున్నారు విశాల్.

తన తండ్రి జీకే రెడ్డిలా ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడకూడకూడద, చిన్న సినిమాల నిర్మాతగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారని విశాల్ తెలిపారు. ఓ చిత్రాన్ని విడుదల చేయాలంటే నిర్మాతల సంఘం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని విశాల్ చెప్పుకొచ్చారు.

విశాల్

విశాల్

విశాల్ నడిగర్ సంఘం(తమిళ సినీ నటుల సంఘం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత పలు వివాదాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతంలో సంఘంలో జరిగిన కొన్ని లోపాలను, అవినీతిని విశాల్ ఎత్తి చూపారు. ఇపుడు నిర్మాతల మండలిలో విశాల్ ఎంటర్ అయితే తమకు మంచి జరుగుతుందని చిన్న నిర్మాత నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హామీలు నెర వేర్చాను

హామీలు నెర వేర్చాను

నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ఏప్రిల్ లో సంఘం భవన నిర్మాణం ప్రారంభమవుతుందని విశాల్ తెలిపారు. నిర్మాతల మండలికి నన్ను పంపిస్తే అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని విశాల్ తెలిపారు.

విశాల్ మీద గతంలో నిషేదం

విశాల్ మీద గతంలో నిషేదం

సంవత్సరం క్రితం విశాల్ ఓ వారపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ నకిలీ సినిమా సీడీలను నిరోధించడం లో నిర్మాతల సంఘం పూర్తిగా విఫలం అయ్యిందని, ఆ సంఘం సమావేశాలు బొండాలు, బజ్జీలు తినడానికే పరిమితమయ్యారని విమర్శించాడు విశాల. ఆ విమర్శలపై స్పందించిన నిర్మాతల సంఘం అయన సంజాయిషీ నోటీసు జారీ చేసింది. ఆ మేరకు విశాల్ సంజాయిషీ ఇచ్చిన అయన వివరణ సంతృప్తిగా లేదని సంఘం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారి చేసింది. మండలి నుంచి అన్యాయంగా తనను తొలగించారని విశాల్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. అతడిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్మాతల మండలికి కోర్టు ఆదేశాలిచ్చింది.

రసవత్తరమైన పోటీ

రసవత్తరమైన పోటీ

విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు నిర్మాతల మండలిలోనూ సభ్యుడే. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్ష ఎన్నికల్లో విశాల్ గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. పోటీ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.

English summary
The Producers Council Elections is all set to happen on the 2nd of April 2017, at Woodlands theatre and the final list of election candidates have been released. Five candidates are contesting for the President's post, which includes the names like Kalaipuli G.Sekaran, KR, Radhakrishnan.R, Amma Creations T.Siva, Actor Vishal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu