సిక్స్ ప్యాక్ రచ్చ .. స్టార్ హీరో తండ్రిపై విశాల్ ఘాటు వ్యాఖ్యలు .. నిజాలు మాట్లాడమంటూ

చిత్ర పరిశ్రమలో హీరోలకు రకరకాల రికార్డులు ఉంటాయి. ఇండస్ట్రీలో తొలిసారిగా ప్రయోగాలు చేసిన వారుంటారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే సూపర్‌స్టార్ కృష్ణ పేరుతో ఎన్నో రికార్డులు ఉన్నాయి. తొలి కలర్ సినిమా, తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్, తొలి డీటీఎస్, తొలి 70 ఎంఎం ఇలా ఎన్నో కొత్త కొత్త అంశాలను తెలుగు చిత్ర సీమకు అందించి టాలీవుడ్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన తరం కూడా ఎన్నో ప్రయోగాలు చేసింది.

కాగా.. పదేళ్ల కిందట టాలీవుడ్ టూ బాలీవుడ్ సిక్స్ ప్యాక్ ట్రెండ్ వైరల్ అయ్యింది. దేశముదురు చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆరు పలకల దేహం కనిపించారు. ఈ దెబ్బతో యువత పిచ్చెక్కిపోయారు. గతంలో జిమ్ ముఖం చూడని వారు కూడా కండలు పెంచే పనిలో పడ్డారు. అల్లు అర్జున్‌ను చూసి మిగిలిన హీరోలు కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేసి తమ అభిమానులను అలరించారు. అప్పట్లో సిక్స్ ప్యాక్ లేని కుర్రాడు లేడంటే అతిశయోక్తి కాదు. మన టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ సిక్స్ ప్యాక్ కల్చర్ బాగా పాపులర్ అయ్యింది. ఇదే ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో వివాదానికి దారి తీసింది.

Actor Vishal counters hero Suriya s father Sivakumar s comments on six pack

కోలీవుడ్‌లో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సూర్య. రజనీ, విజయ్, కమల్ హాసన్, విక్రమ్, అజిత్ వంటి అగ్రనటుల మధ్య సూర్య దూసుకొచ్చారు. పవర్‌ఫుల్ క్యారెక్టర్లు, విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 27 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో చిత్రాల్లో నటించిన సూర్య ఇటీవల 44వ సినిమా రెట్రోలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మే 1న రెట్రో ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దీనిలో భాగంగా రెట్రో ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది.

ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి , సీనియర్ నటుడు శివకుమార్ మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభం నుంచి మా అబ్బాయి ఎంతో శ్రమించాడని చెప్పారు. నాలుగు గంటల పాటు ఏకధాటిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడని , కోలీవుడ్‌లో తొలుత సిక్స్ ప్యాక్ ట్రై చేసింది సూర్యనే అని చెప్పారు శివకుమార్. తనకు ముందు ఏ హీరో కూడా ఆరుపలకల బాడీ ట్రై చేయలేదని ఈ విషయంలో నేను ఎంతో గర్వపడుతున్నానని శివకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సూర్య అభిమానులు విపరీతంగా దానిని షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

శివకుమార్ వ్యాఖ్యలపై మరో స్టార్ హీరో విశాల్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నిజానికి కోలీవుడ్‌లో తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీ ట్రై చేసింది ధనుష్ అని చెప్పారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన పొల్లాధవన్ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించారని ఆయన వెల్లడించారు. అనంతరం నేను సత్యం సినిమాలో సిక్స్ ప్యాక్‌తో వచ్చానని, ఆ తర్వాత మదగజ రాజలోనూ సిక్స్ ప్యాక్‌లో కనిపించానని విశాల్ పేర్కొన్నారు. ఈ విషయాలను బహుశా వాళ్లు మరిచిపోయారని ఆయన సెటైర్లు వేశారు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సూర్య అభిమానులు కౌంటరిస్తున్నారు.

More from Filmibeat

Read more about: vishal suriya sivakumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X