For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారాహిపై హైకోర్టులో పిటిషన్ వేసిన విశాల్, ఈ గొడవలకు ముగింపే లేదా?

  By Srikanya
  |

  చెన్నై: తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మాస్‌ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు విశాల్‌. తమిళనాడు సినీ రాజకీయాల్లోనూ విశాల్‌ తనదైన ముద్ర వేశాడు. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు. అయితే ఆయన గెలిచాడన్నమాటే కాని ఎప్పుడూ ఏదో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉన్నాడు.

  హీరో విశాల్ సినిమాల ద్వారా కాకుండా ఎక్కువ వివాదాల ద్వారానే వార్తల్లో ఉంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో కేసు వేసి మరోసారి మీడియాకు ఎక్కారు. నడిగర సంఘ సెక్రటరిగా ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూండటంతో రకరకాల వివాదాలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే విశాల్ వెనకడుగు వెయ్యకుండా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే...దక్షిణ భారత నటీనటుల సంఘం ఆవరణలో జరిగిన వివాదంపై చర్యలు తీసుకునేలా తేనంపేట పోలీసులను ఆదేశించాలని తమిళ నడిఘర్ సంఘ కార్యదర్శి విశాల్ బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  ఈ పిటిషన్‌లో విశాల పేర్కొన్న విషయాలు..తమ సంఘ సభ్యుడైన వారాహి అనే వ్యక్తి సంఘ చర్యల గురించి కొన్ని వివరాలను కోరుతూ గత మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు లేఖలు రాశారని తెలిపారు. ఆయన ప్రశ్నలకు వివరణ ఇవ్వడానికి ఆగస్ట్ 27న సంఘ కార్యాలయానికి రావలసిందిగా పిలిచినట్లు పేర్కొన్నారు.

  Actor Vishal filed a petition in High court

  అయితే ఆ రోజు సంఘ కార్యవర్గ సభ్యులు ముగ్గురు, న్యాయ సలహాదారుడు కార్యాలయంలో ఉండగా, వారాహి వారితో మాట్లాడనని, సంఘం నిర్వాహకులనే ప్రశ్నిస్తానని అక్కడి నుంచి వెళ్లి మీడియాతో మాట్లాడుతూ సంఘంపై పలు ఆరోపణలు చేశారన్నారు.
  సంఘ ఆవరణ ముందు నిలబడ వద్దని వారించినా సంఘ కార్యవర్గ సభ్యులతో అతడు వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు.

  అంతేకాకుండా అతడు సంఘ సభ్యులపై హత్యాబెదిరింపులు చేశారని తెలిపారు. ఈ వ్యవహారం గురించి సంఘ మేనేజర్ స్థానిక తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తమ ఫిర్యాదు పరిగణలోకి తీసుకుని విచారించి వారాహిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే కోర్టు విచారణ చేయనుంది.

  ఇందంతా ఇలా ఉంటే..విశాల్‌.. శరత్‌కుమార్‌ కూతురు వరలక్ష్మితో ప్రేమలో ఉన్నాడన్నది సినిమా ఇండస్ట్రీ టాక్‌. ఈ విషయాన్ని విశాల్‌ వద్ద ప్రస్తావించినా.. ఎప్పుడూతను కేవలం స్నేహితురాలే అంటూ తప్పించుకునేవాడు. ఇక తప్పించుకున్నది చాలులే అనుకున్నాడో ఏమో వరలక్ష్మితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ఈ ఫొటో అన్నింటికీ సమాధానం చెబుతుంది అని ట్వీట్‌ చేశాడు. విశాల్‌ పరోక్షంగా తన ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ కోలీవుడ్‌ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

  English summary
  After his big battle with Sarathkumar the senior hero fo Kollywood Vishal now even reached court on the same issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X