హీరోయిన్‌తో విశాల్ ఎఫైర్ రూమర్ మాత్రమే.. త్వరలో హైదరాబాద్ అమ్మాయితో నిశ్చితార్థం!
తరచుగా వివాదాల్లో నిలిచే హీరో విశాల్. సినీ రాజకీయ అంశాల్లో తరచుగా విశాల్ పేరు వినిపిస్తూ ఉంటుంది. పేరుకు తమిళ హీరో అయినా తెలుగువారితో విశాల్ కు అనుబంధం ఎక్కువ. విశాల్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. పలు సందర్భాల్లో ఆ వార్తలని ఖండించిన విశాల్ త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో విశాల్ నిశ్చితార్థం జరగబోతోందని తమిళ మీడియాలో బలమైన వార్తలు వస్తున్నాయి. దీనితో విశాల్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లకు తెర పడ్డట్లు అయింది.

వరలక్ష్మి శరత్ కుమార్‌తో ఎఫైర్
విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య చాలా రోజులుగా ఎఫైర్ సాగుతోందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో క్లొజ్ గా ఉండడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. కానీ తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ స్పష్టం చేశారు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని తెలిపారు. విశాల్ త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హైదరాబాద్ అమ్మాయి
విశాల్ వివాహం చేసుకోబోయేది అనీషా అనే హైదరాబాద్ యువతిని అని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే హైదరాబాద్ లో విశాల్ నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాల్ తండ్రి జీకే రెడ్డి తమిళ మీడియాకు సమాచారం ఇచ్చారట. త్వరలోనే విశాల్ వివాహం గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నడిగర్ సంఘం భవనం
నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను వివాహం చేసుకుంటానని విశాల్ గతంలో శపథం చేశాడు. త్వరలోనే భావన నిర్మాణం కూడా పూర్తి కానుంది. ఈ లోపు నిశ్చితార్థం చేయాలని విశాల్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పందెం కోడి చిత్రం విశాల్ కు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. తెలుగులో కూడా విశాల్ చిత్రాలకు మార్కెట్ ఉంది.

వివాదాలు
ప్రస్తుతం విశాల్ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఉన్నాడు. మండలిలోని నిర్మాతలంతా ఆరోపణలు చేస్తుండడంతో విశాల్ వివాదాలతో సతమతం అవుతున్నాడు. రాజకీయాలపై కూడా విశాల్ కు ఆసక్తి ఉంది. ఆ మధ్యన జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ కు జరిగిన ఉపఎన్నికలో విశాల్ పోటీ చేయాలని భావించినా కుదర్లేదు.


Click it and Unblock the Notifications











