షూటింగులో గాయపడిన విశాల్.. 100 ఫైటర్లు ఎటాక్ చేయడంతో..
తమిళ హీరో విశాల్ షూటింగులో గాయపడ్డారు. వినోద్ కుమార్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లాఠీ సినిమా షూటింగుకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే విశాల్ గాయపడటంతో చిత్ర యూనిట్ షూటింగును వాయిదా వేశారు.
ఆగస్టు 12వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లను 100 ఫైటర్లతో చిత్రీకరిస్తున్నారు. వందమంది విశాల్ క్యారెక్టర్‌ను ఎటాక్ చేయాల్సింది. అయితే ఫైటింగ్ సన్నివేశాల్లో యాక్సిడెంటల్‌గా విశాల్ కాలిపై ఫైటర్ గట్టిగా కొట్టారు. దాంతో ఆయనకు స్వల్ప గాయమైంది. షూటింగ్ ప్రాంతంలోనే విశాల్ కిందపడిపోయాడు.

షూటింగ్ స్పాట్‌లో గాయపడిన వెంటనే విశాల్‌ను హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం ఎలాంటి ఫ్రాక్చర్ లేదని చెప్పారు. అయితే నిలబడేందుకు కష్టపడుతున్నాడు కాబట్టి.. విశాల్‌కు కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని చెప్పారు.
ఇటీవల కాలంలో విశాల్ గాయపడటం ఇది రెండోసారి. గతంలో హైదరాబాద్‌లో ఓ షూటింగు సమయంలో విశాల్ గాయపడ్డాడు. అయితే ఆ షూటింగులో భారీ ప్రమాదం నుంచి విశాల్ తప్పించుకొన్నాడు.


Click it and Unblock the Notifications











