twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్ లో ప్రమాదం.. హీరో విశాల్ కి తీవ్రగాయాలు.. అసలు ఏమైందంటే?

    |

    తమిళంలో స్టార్ హీరోగా ఉన్న విశాల్ తెలుగులో కూడా చాలా ఫేమస్. దాదాపు ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. స్వతహాగా తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఆయన హీరోగా నటిస్తున్న 31వ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్లో ఆయనకు ప్రమాదం జరిగగా వెన్ను భాగానికి పెద్ద గాయం అయిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    Leaked Shocking Pictures of Indian Celebs Photos

    విశాల్ 31

    విశాల్ 31

    నటుడు విశాల్ ఎనిమీ షూట్ పూర్తి చేసి, ఇప్పుడు డిబి శరవణన్ దర్శకత్వం వహించిన చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తాత్కాలికంగా 'విశాల్ 31' పేరుతో ఉన్న ఈ చిత్రంలో డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది.

    Mangli : పాట మారుద్దామనుకున్నా కానీ, వాళ్ళు కూడా నా జాతి గురించి మాట్లాడతారా, గుడికట్టించా.. !

    హైదరాబాద్ లో

    హైదరాబాద్ లో

    మలయాళ నటుడు, బాబూరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యోగి బాబు, అఖిలన్, రవీనా, సీత తదితరులు నటిస్తున్నారు. బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విశాల్ తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరపున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదుజాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టన్నింగ్ ఫొటోస్.. ఆ అందాల ఆరబోత మామూలుగా లేదు

    విలన్ తో ఫైట్ సీన్ లో

    విలన్ తో ఫైట్ సీన్ లో

    తాజాగా విశాల్ బాబూరాజ్‌తో గొడవపడే సన్నివేశాన్ని నిన్న చిత్రీకరించారు. ఈ షూటింగ్ లో భాగంగా బాబూరాజ్ నెట్టడంతో విశాల్ బలంగా వెళ్లి వెనుకగా గుద్దు కున్నారు. దీంతో విశాల్ వెన్నుకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. షూటింగ్ అప్పటికప్పుడు ఆపడంతో ఫిజియోథెరపిస్ట్ వర్మ వెంటనే వచ్చి విశాల్ కు చికిత్స అందించారు. కొంచెం సమయం తర్వాత విశాల్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించాడు.

    Raj Kundra మామూలోడు కాదుగా.. ప్రతి దానికి సెపరేట్ టీమ్.. లండన్ అప్లోడ్ స్కెచ్ మాత్రం!

    Recommended Video

    Chakra : Telugu Audience Are Always Says Actor Vishal
    కొన్ని రోజులు విశ్రాంతి

    కొన్ని రోజులు విశ్రాంతి

    అయితే విశాల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సలహా ఇచ్చారు.విశాల్ నటించిన చివరి చిత్రం చక్రకి మంచి ఆదరణ లభించింది. చక్ర తరువాత దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ఎనిమీలో నటుడు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఆర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత విశాల్ 'డిటెక్టివ్ 2' చిత్రానికి దర్శకత్వం వహించాలని యోచిస్తున్నాడు.

    గతంలో కూడా

    గతంలో కూడా

    ఇక నిజానికి ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో గతంలో కూడా ప్రమాదం జరిగింది.ఒక ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో తృటిలో ప్రమాదం తప్పిందని అయితే ఇందులో స్టెంట్ మాన్ తప్పేమీ లేదని విశాల్ పేర్కొన్నారు. కేవలం మిస్ టైమింగ్ వల్ల తన తలకు సీసా తగిలింది అని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇలాంటి పొరపాట్లు జరగడం సహజం అని ఆయన పేర్కొన్నారు. డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో విశాల్ కు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    English summary
    Actor vishal was seriously injured during the shooting of the film. While shooting for the climax stunt sequence, Vishal suffered a severe spinal injury after being hit by a wall.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X