సీక్రెట్‌గా జ్వాలా గుత్తా, విష్ణువిశాల్ ఎంగేజ్‌మెంట్.. అర్ధరాత్రి హడావిడిగా నిశ్చితార్థం ఉంగరం..

కొద్దికాలంగా తమిళ హీరో విష్ణు విశాల్‌, బాడ్మింటన్ క్రీడాకారిణి, నటి గుత్తా జ్వాలా మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో వారిద్దరి విరహ వేదన సోషల్ మీడియాలో హైలెట్‌గా మారింది. విరహంతో వారిద్దరి మధ్య జరిగిన ఛాటింగ్, విషెస్ తెలియ చేసుకోవడం సోషల్ మీడియాను వేడెక్కించింది. విష్ణు విశాల్‌ బర్త్ డే రోజున మన మధ్య మ్యాచ్ ఇలా సుదీర్ఘంగా సాగాలి అంటూ జ్వాలా గుత్తా ట్వీట్ చేయడం వైరల్ అయింది. ఈ క్రమంలో తమ మధ్య మ్యాచ్‌ మరింత సుదీర్ఘంగా సాగేలా ఓ శాశ్వత బంధానికి నిర్ణయం తీసుకొంటూ నిశ్చితార్థం జరుపుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. జ్వాలా గుత్తా నిశ్చితార్థం గురించి..

భార్యకు విడాకులు ఇచ్చిన విష్ణు విశాల్

భార్యకు విడాకులు ఇచ్చిన విష్ణు విశాల్

విష్ణు విశాల్ తన కాలేజీ లైఫ్‌లో నటుడు కే నటరాజ్ కూతురు రజినీ నటరాజ్‌తో ప్రేమలో పడ్డారు. 2011లో పెళ్లి వారిద్దరి పెళ్లి చేసుకొన్నారు. 2017లో కుమారుడు కూడా పుట్టారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో 2018లో విడిపోయారు. దాంతో ఏడేళ్ల దాంపత్య జీవితానికి తెరపడింది. అప్పటి నుంచి జ్వాలా గుత్తా, విష్ణు సహజీవనం చేస్తున్నారు.

భర్తకు జ్వాలా గుత్తా డైవోర్స్..

భర్తకు జ్వాలా గుత్తా డైవోర్స్..

బాడ్మింటన్ క్రీడాకారిణిగా జ్వాలా కెరీర్ ఉన్నతంగా సాగుతున్న సమయంలోనే తన తోటి క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే వారిమధ్య మనస్పర్ధలు రావడంతో వారిద్దరు జూన్ 2011లో విడిపోయారు. క్రికెటర్ అజారుద్దీన్‌తో అఫైర్ కారణంగానే చేతన్‌తో జ్వాలా విడిపోయిందనే వార్తలు వచ్చాయి. అయితే అజర్ ఆ వార్తలను ఖండించారు. ఆ తర్వాత చాలా రోజుల అనంతరం విష్ణు విశాల్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది.

కొద్ది నెలలుగా డేటింగ్ చేస్తూ...

కొద్ది నెలలుగా డేటింగ్ చేస్తూ...

గత కొద్ది నెలలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న తమిళ హీరో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొన్నారు. గుత్తా జ్వాలా జన్మదినం రోజునే అధికారికంగా నిశ్చితార్థం జరుపుకొన్నారు. అత్యంత ప్రైవేట్‌ వేడుకగా జరిగిన కార్యక్రమానికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

జ్వాలా బర్త్ డే రోజున ఎంగేజ్‌మెంట్

జ్వాలా బర్త్ డే రోజున ఎంగేజ్‌మెంట్

తమ పెళ్లి నిశ్చితార్థం గురించి విష్ణు విశాల్ ట్వీట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే గుత్తా జ్వాలా. కొత్త జీవితం ప్రారంభమైంది. మంచి భవిష్యత్ కోసం మనం పాజిటివ్‌గా ఉంటూ ముందుకెళ్దాం. ఆర్యన్, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రజల దీవెనలతో సుదీర్ఘంగా బంధాన్ని కొనసాగిద్దాం అని విష్ణు విశాల్ ట్వీట్ చేశారు.

మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలి అంటూ

మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలి అంటూ

గుత్తా జ్వాలతో నా కొత్త జీవితం ప్రారంభం అవుతున్న క్రమంలో మీ దీవెనలు, ఆశీర్వాదం కావాలి. జీవితానికి ఇది కొత్త ప్రారంభం. అనుకొని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఎంగేజ్‌మెంట్ రింగ్ అందించిన బసంత్ జైన్ ధన్యవాదాలు అంటూ విష్ణు విశాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X