twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు వివేక్‌ మరణం వెనుక అసలు కారణం అదే.. ఎస్పీ బాలు మాదిరిగానే.. వైద్యుల క్లారిటీ

    |

    ప్రముఖ హాస్యనటుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వివేక్ మరణించారనే వార్తను ఇంకా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా కారణమనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం వివాదంగా మారింది. అయితే ఇప్పటికే సిమ్స్ వైద్యులు ఆయన మరణానికి టీకా కారణం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే తాజాగా డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ఓ మీడియాతో మాట్లాడుతూ..

     కోవిడ్ టీకా వల్లనే అంటూ

    కోవిడ్ టీకా వల్లనే అంటూ

    వివేక్ మరణం నేపథ్యంలో చెన్నైలోని పలువురు వైద్యులతో చర్చించాను. వివేక్ మృతికి కారణాలు ఏమిటనే విషయాన్ని తెలుసుకొన్నాను. ఆయన మరణానికి కారణం కోవిడ్ టీకా కారణం కానే కాదని ఆయన స్పష్టం చేశారు. వాక్సిన్ కారణమంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే ఆయన ఆకస్మిక మరణానికి కారణాలను వివరించారు.

    మరణానికి రెండు రోజుల ముందు

    మరణానికి రెండు రోజుల ముందు

    వివేక్ తన మరణానికి ముందు రెండు రోజుల ముందు వివేక్‌‌తోపాటు 830 మంది సామూహికంగా వాక్సిన్ తీసుకొన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నై వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటనే ఆయనకు ట్రీట్‌మెంట్ అందిస్తూ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు అని డాక్టర్ వెంకట్ రావు తెలిపారు.

    ఎస్పీ బాలు మాదిరిగానే ఎక్మో

    ఎస్పీ బాలు మాదిరిగానే ఎక్మో

    సిమ్స్ హాస్పిటల్‌కు చేరిన వెంటనే వివేక్‌కు ఎక్మో ద్వారా అంటే కృత్రిమ ఊపిరితిత్తులతో చికిత్స అందించారు. గతంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఇదే రీతిలో చికిత్స అందించారు. వివేక్ విషయానికి వస్తే.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు నాళాల్లో రెండు పూర్తిగా చెడిపోయాయి. అందుకే ఆయనకు గుండెపోటు వచ్చింది అని వైద్యులు తెలిపారు.

    రక్త నాళాల్లో గడ్డ కట్టి ఉండటం

    రక్త నాళాల్లో గడ్డ కట్టి ఉండటం

    వివేక్ హస్పిటల్‌లో చేరిన తర్వాత వైద్యులు అత్యాధునిక సాంకేతికతతో చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. కానీ గుండెకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో ఓ గడ్డ ఉంది. అది ఎప్పడో మూడు, నాలుగు నెలల క్రితం ఏర్పడి ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఒకవేళ ఒకట్రెండు రోజుల్లో గడ్డ కడితే అది సులభంగా తొలగించడానికి వీలు అయ్యేది. దాంతో స్టంట్ వేసి రక్తాన్ని గుండెకు చేరవేసేలా వైద్యులు ప్రయత్నించారు అని వైద్యుడు వెంకట్ రావు పేర్కొన్నారు.

    Recommended Video

    Acharya : స్లో పాయిజన్ లా ఎక్కుతున్న Laahe Laahe Song
    830 మందిని పరీక్షించగా

    830 మందిని పరీక్షించగా

    వివేక్ మరణానికి కరోనా వ్యాక్సిన్ కారణమా అనే విషయంపై తమిళనాడు ప్రభుత్వం వైద్యులతో దర్యాప్తు చేయించింది. వివేక్‌తోపాటు తీసుకొన్న 830 మందిని అధికారులు పరీక్షించారు. వారిలో నలుగురు మాత్రమే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మిగితా అని తెలిసింది. వివేక్ మరణానికి వ్యాక్సిన్ కాదని అధికారులు తేల్చారు. వివేక్ మరణం యాదృచ్చికమే అంటూ డాక్టర్ వెంకట్ రావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    English summary
    Vivek died due to Cardiac Arrest: South Super Star Rajinikanth tribute over Vivek demise. He pens a emotional letter. Rajinikanth wrote that Chinna Kalaivaanar, social activist and my close friend Vivek's demise has broken my heart. In this occassion, Doctors given clarity on vivek death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X