twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vivek no more: సమాజానికి ఎనలేని సేవ.. తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ప్రధాని మోదీ..

    |

    ప్రముఖ కమెడియన్ వివేక్ ఇకలేరనే వార్త అభిమానులను, సినీ తారలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. శుక్రవారం రోజున ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు గురికావడంతో వడపళనిలోని సిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో మరణించారు. ఈ వార్తతో కోలీవుడ్ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయింది. వివేక్ మృతిపై పలువురు సినీ, రాజకీయ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

    కమెడియన్ వివేక్‌కు శ్రద్దాంజలి ఘటించిన సినీ తారలు.. కంటతడి పెట్టిన కీర్తి సురేష్

    నటుడు వివేక్ మరణ వార్తతో విషాదంలో మునిగిపోయాను. ఆయన కామిక్ టైమింగ్, ఇంటెలిజెన్స్ డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులు అద్బుతమైన వినోదాన్ని పంచారు. తన చిత్రాల ద్వారా, తన జీవితంలో సమాజానికి, పర్యావరణానికి ఎనలేని సేవ చేశారు. వివేక్ అభిమానులకు, స్నేహితులకు, కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓశాంతి అంటూ నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.

    Actor Vivek demise: Prime minster Narendra Modi condolences

    చెన్నైలోని తన నివాసం వద్ద వివేక్ పార్తీవ దేహాన్ని అభిమానులు, సన్నిహితుల సందర్శనార్థం ఉంచారు. శరత్ కుమార్, అర్జున్, కీర్తీ సురేష్, సూర్య, కార్తీ తదితరులు ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. నటుడు సిద్దార్థ్, కీర్తి సురేష్, త్రిష, కంటతడి పెట్టి భోరుమన్నారు.

    English summary
    Vivek died due to Cardiac Arrest: Prime minster Narendra Modi condolences and wrote that, The untimely demise of noted actor Vivek has left many saddened. His comic timing and intelligent dialogues entertained people. Both in his films and his life, his concern for the environment and society shone through. Condolences to his family, friends and admirers. Om Shanti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X