సారీ రాలేకపోయా.. క్షమాపణ చెప్పిన వివేక్.. చివరి వీడియో వైరల్
రెండు దశాబ్ద కాలానికిపైగా తన హాస్యంతో దగ్గరైన నటుడు, పద్మశ్రీ వివేక్‌కు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు చివరి విడ్కోలు చెప్పుతున్నారు. గుండెపోటు కారణంగా మరణించిన ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఆయన మరణం నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుభూతులను నెమరు వేసుకొంటున్నారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడిన చివరి వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే....
వివేక్ సామాజిక సేవ విషయానికి వస్తే కోటి మొక్కల నాటడం అనే గొప్ప కార్యానికి పూనుకొన్నాడు. గ్రీన్ కలామ్ ప్రాజెక్ట్ పేరుతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపత్తూరులోని సేక్రడ్ హార్ట్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు. ఆ ప్రాంతంలో కనీసం 5వ వేల మొక్కలను నాటాలనే కార్యక్రమానికి హాజరవుతానని మాట ఇచ్చారు. కానీ ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా వీడియోను రిలీజ్ చేసిన వివేక్.. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా హాజరుకాలేకపోయాను. ప్రభుత్వ అధికారులు వద్దని చెప్పడం వల్ల నేను రాలేకపోయాను. కరోనావైరస్ పరిస్థితులు చక్కబడగానే వచ్చి మీతో కలిసి మొక్కలు నాటుతాను అని చెప్పారు. ప్రస్తుతం వివేక్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











